Fixed Income Scheme: పోస్టాఫీస్, ఒకప్పుడు లెటర్ల పంపిణి వంటి సేవల కోసం ఎక్కువగా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇవి సాధారణ వాణిజ్య బ్యాంకులను మించిపోయేలా ఆర్థిక సేవలను అందిస్తున్నాయి. ఆ ఆధునిక యుగంలో కూడా కేవలం లెటర్లు, పార్శిళ్ల సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, పెట్టుబడి, పొదుపు పథకాలకు కేంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో, పోస్టాఫీస్ అందించే కొన్ని పొదుపు పథకాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ముఖ్యంగా స్థిర ఆదాయం కోరుకునేే వారికి, పెట్టుబడిదారులకు, నెలకు నెల సంపాదన అందించే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఎంతో మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ స్కీం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా నెల నెలకూ ఆదాయాన్ని అందించే ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్ అంటే ఏంటి?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గం, ఇది నెలనెలా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మీరు ఒకసారి దీనిలో డిపాజిట్ చేసి నెలనెలా వడ్డీ అందుకోవచ్చు. మీరు బ్యాంక్ FD (స్థిర డిపాజిట్) పథకాల కంటే దీనిలో మంచి వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా, రిస్క్ లేకుండా, ప్రతి నెలా హామీ ఆదాయం కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఛాయిస్.
MIS పథకం ముఖ్యమైన లక్షణాలు:
-7.4% వార్షిక వడ్డీ – ప్రస్తుతం పోస్టాఫీస్ ఈ పథకంలో 7.4% వడ్డీని అందిస్తోంది.
-నెలవారీ వడ్డీ చెల్లింపు – మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై నెలనెలా వడ్డీ పొందవచ్చు.
-ఒక్కసారి పెట్టుబడి – ఇది ఒకసారి మాత్రమే పెట్టాల్సిన పెట్టుబడి. 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
-లిమిట్ వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
-జాయింట్ అకౌంట్ సదుపాయం – ఒక ఖాతాలో గరిష్టంగా ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు.
-పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా అవసరం – MIS అకౌంట్ తెరవాలంటే, మీకు పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉండాలి.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ …
ఐదేళ్లలో ఐదు లక్షలకుపైగా లాభం
ఉదాహరణగా, మీరు రూ. 15 లక్షలు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 9,250 వడ్డీగా పొందవచ్చు. అంటే, 5 ఏళ్లలో మీ ఖాతాకు మొత్తం రూ. 5,55,000 వడ్డీగా జమ అవుతుంది. 5 సంవత్సరాల తరువాత, మీరు పెట్టుబడి పెట్టిన రూ. 9 లక్షలు తిరిగి పొందుతారు. దీంతో మీకు మొత్తం రూ. 14,55,000 లభిస్తుంది. అంటే మీరు ఐదేళ్లలో ఐదు లక్షలకుపైగా పొందుతారు.
MIS ఖాతా ఎలా తెరవాలి?
-మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సందర్శించండి.
-KYC డాక్యుమెంట్లు – ఆధార్ కార్డు, PAN కార్డు, అడ్రస్ ప్రూఫ్ అందించండి.
-పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా ఉండాలి (లేదంటే కొత్తదాన్ని ఓపెన్ చేయాలి).
-అప్లికేషన్ ఫారం పూరించండి, అవసరమైన మొత్తం డిపాజిట్ చేయండి.
-ఖాతా ప్రారంభించాక, మీరు ప్రతి నెలా వడ్డీ పొందడం ప్రారంభించవచ్చు.
పోస్టాఫీస్ MIS ముఖ్యమైన ప్రయోజనాలు
రిస్క్-ఫ్రీ పెట్టుబడి: భారత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహించడంతో పూర్తి భద్రత కలదు.
నెలవారీ ఆదాయం: వృద్ధులకు లేదా రెగ్యులర్ ఆదాయాన్ని కోరుకునేవారికి సరైన ఎంపిక.
లాంగ్-టర్మ్ పెట్టుబడి: 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత డబ్బును తిరిగి పొందే అవకాశం.
బ్యాంకు FD కంటే మెరుగైన వడ్డీ: బ్యాంక్ FDలతో పోలిస్తే 7.4% వడ్డీ ఆకర్షణీయంగా ఉంటుంది.
పదివేలల్లో మొదలు పెట్టొచ్చు: కనీసం రూ. 1000తో ఖాతా ప్రారంభించవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన అంశాలు
-MIS పథకంలోని వడ్డీ ఆదాయంపై టాక్స్ వర్తించవచ్చు. అయితే, దీనిపై TDS (Tax Deducted at Source) ఉండదు.
-5 ఏళ్లకు ముందు ఖాతాను మూసివేస్తే, కొన్ని నియమాలు వర్తిస్తాయి. 1 సంవత్సరంలోపు మూసుకుంటే వడ్డీ ఇవ్వబడదు. 1-3 సంవత్సరాల మధ్య రద్దు చేసుకుంటే 2% పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది
-రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు: 5 ఏళ్ల తరువాత, మరో కొత్త MIS అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బును మళ్లీ పెట్టుబడి చేయోచ్చు.