BigTV English

Sailesh Kolanu: చిత్ర బృందం కష్టాన్ని దొంగలిస్తున్నారు.. లీకులపై హిట్ డైరెక్టర్ అసహనం..!

Sailesh Kolanu: చిత్ర బృందం కష్టాన్ని దొంగలిస్తున్నారు.. లీకులపై హిట్ డైరెక్టర్ అసహనం..!

Sailesh Kolanu:ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Director Sailenu Kolanu) 2020లో హిట్ సినిమా ద్వారా సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈయన మళ్లీ 2022లో హిట్: ది సెకండ్ కేస్ సినిమా చేసి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2023లో వెంకటేష్ 75వ చిత్రంగా సైంధవ్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిట్ 3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు శైలేష్ కొలను. ఇదిలా ఉండగా సినిమా ఏదైనా సరే చిత్ర బృందం ఎంతో కష్టపడి, ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంద. కానీ ఇంతలోపే కొంతమంది ఆకతాయిలు సినిమా నుంచి కొన్ని లీకులు చేస్తూ సినిమా బృందం యొక్క కష్టాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా లీక్ అవుతున్న కారణంగా దర్శకుడు శైలేష్ కొలను మండిపడుతూ ఒక పోస్టు షేర్ చేశారు.


Odela 2 Theatrical Rights: ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయిన ఓదెల 2 వరల్డ్ థియేట్రికల్ రైట్స్..!

చిత్ర బృందం కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు – శైలేష్ కొలను..


ఇకపోతే ఒక సినిమాకు సంబంధించిన ఏదైనా విషయాన్ని లీక్ చేసేముందు కొంతమంది ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లేదు. దానివల్ల చిత్ర బృందం శ్రమ దోపిడీకి గురవుతోంది అంటూ శైలేష్ కొలను అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెడుతూ.. “థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుడికి మంచి అనుభూతి పంచేందుకు తెర వెనుక చాలామంది పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. సినిమాలోని కొన్ని మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. అయితే కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వాటి గురించి లీక్ చేస్తుండడం చాలా బాధగా ఉంది. అయితే ఇది సరైనది కాదు అనుకొని కొన్ని ఈవెంట్లను రిపోర్టు చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కూడా అదే ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఇలా లీక్ చేయడం చిత్ర బృందం కష్టాన్ని దోచుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా దోచుకోవడమే ” అంటూ శైలేష్ తెలిపారు.

డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలు..

ఒక శైలేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. నాని హీరోగా శైలేష్ తెరకెక్కిస్తున్న చిత్రం హిట్ 3.ఇందులో ఒక కోలీవుడ్ హీరో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు గురువారం ఉదయం నుంచి నెట్టింట పోస్ట్లు వెలబడ్డాయి. దీనికి తోడు కొన్ని వెబ్ సైట్లు కూడా ఈ వార్తలు రాయడంతోనే దీనిపైన దర్శకుడు అసహనం వ్యక్తం చేస్తూ.. ఇలా పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈయన తొలిసారి దర్శకత్వం వహించిన హిట్ సినిమా విషయానికి వస్తే.. 2020 ఫిబ్రవరి 28న విడుదలై సరికొత్త విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నాని , ప్రశాంతి తిప్పిరినేని నిర్మించారు . అంతేకాదు ఈ సినిమాతో శైలేష్ ని దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా నాని కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ తదితరులు నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇక హిట్ 2 విషయానికి వస్తే సేమ్ బ్యానర్లో అడవి శేషు హీరోగా, మీనాక్షి చౌదరి , రావు రమేష్, పోసాని కృష్ణ మురళి , భానుచందర్ తదితరులు కీలకపాత్రను పోషించారు. 2022 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×