Odela 2 Theatrical Rights.. ప్రముఖ డైరెక్టర్ అశోక్ తేజ (Ashok Tej) దర్శకత్వంలో సంపత్ నంది (Sampath Nandi) రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల 2’. ఇందులో తమన్నా భాటియా(Tamannaah Bhatia), హెబ్బా పటేల్(Hebba Patel), వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రంలో నాగ మహేష్, యువ, వంశీ , గగన్ విహారి, భూపాల్ పూజారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ పతాకాలపై ఢీ.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక పోతే 2022లో వచ్చిన ‘ ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్ ఇది. ఇందులో ఓదెల మల్లన్న స్వామి దుష్టశక్తుల నుంచి తన గ్రామాన్ని ఎలా కాపాడుతాడో ఈ సినిమాలో చూపించనున్నారు.
ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయిన థియేట్రికల్ హక్కులు..
ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గా తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేయగా.. అందులో తమన్నా అమ్మవారి గెట్ అప్ లో కనిపించింది. అలాగే ఒక దేవాలయం , ఒక ఊరు తో పాటు దుష్టశక్తుల నుంచి ఓదెలను రక్షించే దైవ శక్తి కథను మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను రూ.12 కోట్లకు శంకర్ పిక్చర్స్ వారు కొనుగోలు చేసారు.మొత్తానికైతే ఫ్యాన్సీ రేటుకే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి.
ఓదెల 2 కి పోటీగా అనుష్క ఘాటీ..
ఇకపోతే ఏప్రిల్ 17 గురువారం కావడంతో ఓదెల 2 సినిమాకి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే తమన్నా సినిమాకి సోలో రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఎందుకంటే అదే వారంలో మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అనుష్క శెట్టి (Anushka Shetty), డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Director Krish Jagarlamudi) కాంబినేషన్లో వస్తున్న ‘ఘాటీ’ సినిమా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఓదెల 2 కి అనుష్క మూవీ పోటీగా నిలబడుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మొత్తానికైతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆట అభిమానులు కూడా కోరుతున్నారు. మరో వైపు తమన్నా చేతిలో ఈ సినిమా తప్ప మరో సినిమా లేదు. అటు తమన్న ఆశలు కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా విజయం ఇప్పుడు తమన్నాకు అత్యంత కీలకంగా మారిపోయింది.