UPI Integration: EPFO సభ్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ సేవలను సభ్యులకు మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను క్లెయిమ్ విత్‌డ్రాల్స్ కోసం ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని శ్రామిక, ఉపాధి కార్యదర్శి సుమిత దావ్రా ప్రకటించారు. EPFOలో 7.5 కోట్ల మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారు. ఇప్పటికే, EPFO రూ. 1 లక్ష వరకు క్లెయిమ్‌లను ఆటోమేటెడ్ చేసింది.
పరీక్షలు పూర్తయిన తర్వాత
ఇదే సమయంలో స్వయంగా సరిదిద్దే విధానాలను ప్రవేశపెట్టి, అనవసరమైన ప్రక్రియలను తొలగించింది. ఈ చర్యల వల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం మూడు రోజులకు తగ్గిందని సుమిత చెప్పారు. UPI ఇంటిగ్రేషన్ ద్వారా సమర్థత పెరుగుతుందని, ఈ కొత్త వ్యవస్థ మే చివరలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీని కోసం EPFO మొదటిసారిగా ఒక కేంద్రీకృత డేటాబేస్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి పలు సూచనలు అందుకున్నామన్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత, UPI ఆధారిత వ్యవస్థ మే చివరలో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని సుమితా దావ్రా అన్నారు. ఇదే సమయంలో వచ్చే జూన్ నుంచి ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ సేవలు కూడా మొదలు కానున్నాయి.
వారి ఖాతాలకు
ఇది సభ్యులకు వారి EPFO ఖాతాలను ఆటో-క్లెయిమ్ చేసుకునేందుకు UPI ఇంటర్‌ఫేస్ నేరుగా లింక్ చేసుకవడానికి అనుమతిస్తుందన్నారు. అర్హత ఉ్నన వారికి తక్షణమే ఆమోదం లభించి, వారి ఖాతాలకు త్వరగా క్రెడిట్ అందుతుందని దవ్రా వెల్లడించారు. అందుకోసం కేంద్రీకృత డేటాబేస్‌ను స్థిరపరచడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత UPI ఫ్రంట్‌ఎండ్‌ను ప్రారంభిస్తామన్నారు.
Read Also: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్.. …
పెన్షన్ యాక్సెస్, ఉపాధి ప్రోత్సాహాలు
ఇదే సమయంలో ప్రధాన పెన్షన్ సంస్కరణల గురించి కూడా దవ్రా ప్రస్తావించారు. EPFOకి చెందిన 78 లక్షల పెన్షనర్లు ఇప్పుడు కేంద్రీకృత పెన్షన్ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతారని, ఇది వారికి ఏ బ్యాంక్ నుంచి అయినా తమ పెన్షన్లను తీసుకునేందుకు అనుమతిస్తుందన్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక బ్యాంకులకు మాత్రమే పరిమితమవ్వడం లేదని స్పష్టం చేశారు.
ఆరోగ్య బీమా
ప్రభుత్వ ఉద్యోగం సంబంధిత ప్రోత్సాహం (ELI) పథకాన్ని ప్రస్తావిస్తూ, దీని నిధులను రూ. 10,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్లకు పెంచినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం మొదటి సారి ఉద్యోగులు, ప్రస్తుత కార్మికులు, ప్లాట్‌ఫారమ్ (జోమాటో, స్విగ్గీ) కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించబడిందన్నారు. దీని ద్వారా అదనపు ఆరోగ్య బీమా కవరేజ్ PM జన ఆరోగ్య యోజన (PMJAY) కింద అందించబడుతుందని వెల్లడించారు.
EPFOలో UPI ఇంటిగ్రేషన్ ఎలా పనిచేస్తుంది?
UPI ఇంటిగ్రేషన్ ద్వారా, EPFO సభ్యులు తమ ఖాతాలను UPI యాప్‌లలో చూడవచ్చు. వారు తమ క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చు. అర్హత ఉన్నప్పుడు, వారి క్లెయిమ్‌లు తక్షణమే ఆమోదించబడతాయి. ఇది EPFO సభ్యులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. UPI ద్వారా క్లెయిమ్ విత్‌డ్రాల్స్ చేయడం చాలా సులభమవుతుంది. కాబట్టి వారు కేవలం కొన్ని క్లిక్‌లతోనే తమ డబ్బును పొందవచ్చు. ఈ కొత్త చర్యలు EPFO సభ్యులకు డిజిటల్ మార్పుతోపాటు మరింత సులభంగా క్లైయిమ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తాయి. దీంతో EPFO సభ్యులు సులభంగా, త్వరగా తమ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసుకోవచ్చు.