BigTV English

EPFO : మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా?.. ప్రాసెస్ ఇదే!

EPFO : మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా?.. ప్రాసెస్ ఇదే!

EPFO


EPFO Account : ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్సేన్స్ ఉపయోగించేవారి సంఖ్య భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రాలు భారీ స్థాయిలో జరిగాయి.

కానీ పీఎఫ్ అకౌంట్‌లో వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లో పడుతుంది ఖాతాదారులకి. మరోవైపు ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ తప్పనిసరిగా ఫైల్ చేయమని కోరుతోంది. పీఎఫ్ అకౌంట్‌లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇ-నామినేషన్ ఫైలింగ్ కూడా చేయలేము.


READ MORE : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్

ఇందులో ముఖ్యంగా ఈపీఎప్ అకౌంట్‌లో పేరు, పుట్టిన తేదీ, నామినీ లాంటి వివరాలు తప్పుగా ఉన్నాయా? లేదా మీ వివరాలు తప్పుగా ఉన్నందుకు మీరు ఈపీఎఫ్ఓ సేవల్ని వినియోగించలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ఓ. వినియోగదారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లోనే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు సరిచేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfoindia.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
  • తర్వాత సర్వీసెస్ సెక్షన్‌లో.. ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అప్పుడు కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ సర్వీసె సెక్షన్‌కి వెళ్లాలి.
  • ఇందులో రెండో ఆప్షన్ మెంబర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీస్‌ని క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అంది మెంబర్ ఇంటర్ఫేస్.
  • ఇందులో యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • టాప్ రిబ్బన్‌లో మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అక్కడ కిందికి వెళ్తే జాయింట్ డిక్లరేషన్ అని ఉంటుంది.
  • అందులో మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేయాలి.
  • ఇందులో మారు చేయాల్సిన మార్పులు వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • అనంతరం రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అది ఎంప్లాయర్ లాగిన్ లో కనిపిస్తుంది. అలాగే ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కి వెళ్తుంది.

READ MORE : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగు

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు ఇప్పుడు ఉమంగ్ యాప్‌ని ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లలో తమ పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ సభ్యులకు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు ప్రాప్యతను అందించడానికి భారత ప్రభుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ ఖాతాదారులు ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ చూడొచ్చు. అంతేకాకుండా ఈపీఎప్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వినియోగదారుడు మొబైల్ ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే క్షణాల్లో పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలిసిపోతుంది.

Tags

Related News

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Big Stories

×