BigTV English

Gold Prcie Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగు!

Gold Prcie Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగు!
gold and silver prices today
gold and silver prices today

Gold & Silver Prices in Telugu States: బంగారం ధర తగ్గుతుందని ఎదురు చూస్తున్న వారికి గత 10 రోజులుగా నిరాశే ఎదురవుతోంది. రోజురోజుకూ పసిడి ధర పెరుగుతుందే తప్ప.. ఇసుమంతైనా తగ్గడం లేదు. ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. జూన్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గుతాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.


మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు 70 రూపాయలు పెరిగి 5,945 గా ఉంది. 8 గ్రాములకు 560 రూపాయలు పెరిగి రూ.47,560గా, 10 గ్రాములకు 700 రూపాయలు పెరిగి రూ.59,450గా, 100 గ్రాములకు 7000 రూపాయలు పెరిగి రూ.5,94,500 వద్ద కొనసాగుతోంది.

అలాగే.. 24 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు 76 రూపాయలు పెరిగింది. ఈరోజు మార్కెట్లో 1 గ్రాము బంగారం ధర రూ.6,485గా ఉంది. 8 గ్రాముల బంగారంపై 608 రూపాయలు పెరిగి రూ.51,880గా ఉండగా.. 10 గ్రాముల బంగారంపై 760 రూపాయలు పెరిగి రూ.64,850 వద్ద కొనసాగుతోంది. 100 గ్రాముల బంగారంపై 7,600 రూపాయలు పెరిగి రూ.6,48,500 వద్ద ఉంది.


18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 1 గ్రాము బంగారంపై రూ.57 పెరిగి.. రూ.4,864 వద్ద కొనసాగుతోంది. 8 గ్రాములపై 456 రూపాయలు పెరిగి రూ.38,912, 10 గ్రాములపై 570 రూపాయలు పెరిగి రూ.48,640, 100 గ్రాములపై రూ.5,700 పెరిగి రూ.4,86,400 వద్ద ఉంది.

Read More: వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ లిస్ట్ నుంచి మస్క్ అవుట్.. ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ అధినేత

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,080గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,485గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,850గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,620గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,000గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,850గా ఉంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,200కు చేరింది. ఢిల్లీ, కోల్ కతాలో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా.. బెంగళూరులో రూ.72,750గా ఉంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×