BigTV English

Bastar Trailer: ఏంటి భయ్యా! ఈ అరాచకం, కేరళ స్టోరీ తరహాలో బస్తర్‌ ట్రైలర్‌

Bastar Trailer: ఏంటి భయ్యా! ఈ అరాచకం, కేరళ స్టోరీ తరహాలో బస్తర్‌ ట్రైలర్‌

What fear Bastar trailer is similar to this Anarchy Kerala story


వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన మూవీ ది కేరళ స్టోరీ. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా కూడా ఇదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో వివాదాల నడుమ 2023 మే 5న థియేటర్లలో విడుదలై బాక్సాపీస్‌ని షేక్‌ చేసింది ఈ మూవీ. వరల్డ్‌ వైడ్‌గా రిలీజై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..బాక్సాపీస్ వద్ద సూపర్‌ హిట్ మూవీగా నిలిచింది. అయితే ఈ మూవీ తీసిన దగ్గర నుండి రిలీజయ్యేంత వరకూ ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. అలాంటి మూవీని తీసిన సంచలన దర్శకుడు సుదీప్తో సేన్‌ మెగా ఫోన్‌ నుంచి మరో సంచలన సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే బస్తర్‌, ది నక్సల్‌ స్టోరీ.

ది కేరళ స్టోరీ మూవీ సాధించిన విజయం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ మూవీ రిలీజై పాజిటివ్‌ టాక్‌తో దేశ ప్రజల దృష్టిని మొత్తం ఆకర్షించింది. ఒక రకంగా చెప్పాలంటే.. ది కేరళ స్టోరీ మూవీ ఓ రాష్ట్ర ఎన్నికలలో ప్రచారాస్త్రంగా మారిందంటే..ఆ మూవీ ప్రభావం ఎలక్షన్‌లో ఏ రేంజ్‌లో ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ది కేరళ స్టోరీని మించి మరో సంచలనం క్రియేట్‌ చేసేందుకు డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ రెడీ అయ్యారు.


Read More: వరల్డ్‌వైడ్‌ టాప్ 50 సినిమా దర్శకుల లిస్ట్‌లో ఉపేంద్రకు చోటు

తాజాగా తన నెక్ట్స్‌ మూవీ బస్తర్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అదాశర్మ మెయిన్ రోల్ పోషిస్తుండగా.. ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, యశ్పాల్ శర్మ, రైమా సేన్, శిల్పాశుక్లా వంటి నటీనటులు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే..ఇండియాలో మరో మూవీ అగ్గిరాజేలా ఉందనే టాక్ మరోసారి తెరపై వినిపిస్తోంది.

ది కేరళ స్టోరీతో ఓ కోణాన్ని ఆవిష్కరించి, కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు సుదీప్తో సేన్‌. తాజాగా మరో వివాదస్పదమైన నక్సలిజంపై పడ్డాడు. బస్తర్‌ మూవీ ట్రైలర్‌ రిలీజైంది ఈ మూవీ ట్రైలర్ రిలీజైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మూవీ యూనిట్. అయినా ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్‌ వస్తోంది.

Read More: అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌, డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

ది కేరళ స్టోరీ ఎలాగైతే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిందో..ఈ మూవీ అంతకు మించి అన్నట్లుగా.. అలాంటి ఇంప్యాక్ట్‌నే జనాల్లో క్రియేట్‌ చేస్తుందని ట్రైలర్‌ చూస్తే ఇట్టే అర్థమవుతుందంటూ మూవీ లవర్స్‌, ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. తీవ్ర వివాదం నడుమ విడుదలైన కేరళ స్టోరీ భారీ వసూళ్లను రాబట్టి.. టాప్‌ 10 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

అలాగే ఇటీవల ఓటీటీలో విడుదలైన కేరళ స్టోరీ.. థియేటర్లను మించిన రెస్సాన్స్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో ఈ సినిమాను జనం ఎగబడి మరీ చూశారు. మార్చి 15న రాబోతున్న బస్తర్‌ మూవీ కూడా కేరళ స్టోరీని మించి, అంతకు మించి అనేలా తన సక్సెస్‌ రేట్‌ని పెంచుకొనులే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే టాక్‌ సినీవర్గాల్లో వినిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో కంప్లీట్‌గా నక్సల్‌ బరిలో జరిగిన పరిణామాలు పోలీసుల నుండి తమ గుడారాలను ఎలా కాపాడుకున్నారు అనే బ్యాక్‌డ్రాప్‌తో ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×