BigTV English

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఈ స్కీం ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజిని విస్తరించింది.


ఇందులో భాగంగా 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు, 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య భీమా అందిస్తున్నారు. . ఈ పథకం పొందేందుకు ఎలాంటి ఆదాయపరిమితి లేకపోవడం అనేది గమనార్హం. దీంతో పాటు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులతో ఎలాంటి సంబంధం లేకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం కల్పించనున్నారు.

ఆయుష్మాన్ భారత్ వల్ల కలిగే అదనపు ప్రయోజనం గురించి తెలుసుకున్నట్లయితే ఇప్పటికే ఒక కుటుంబం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లో ఉన్నట్లయితే వారికి అదనంగా 5 లక్షల రూపాయల టాప్ అప్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ పథకం కింద అటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిలో చికిత్స పొందేందుకు కవరేజీ లభిస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ కార్డు ప్రీ ఎక్జిస్టింగ్ వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ కార్డు వర్తిస్తుంది.


ఆయుష్మాన్ భారత్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ముఖ్యమైన డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి.

అధికారిక వెబ్ సైట్ ద్వారా ఇలా అప్లై చేసుకోండి:
>> beneficiary.nha.gov.in పోర్టల్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
>> Am I Eligible అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో మీ మొబైల్ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
>> ఇప్పుడు ఓపెన్ అయినటువంటి వెబ్ పేజీలో మీ రాష్ట్రం జిల్లా ఆధార్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు.

ఆయుష్మాన్ యాప్ ద్వారా ఇలా అప్లై చేసుకోండి
>> మీ మొబైల్ ఫోన్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి అందులో మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి ఇతర వివరాలు సైతం నమోదు చేసి కేవలం 15 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Common Service Centre ద్వారా అప్లై చేసుకోవచ్చు.
>> మీకు ఆన్లైన్ సర్వీసుల పట్ల అవగాహన లేకపోయినట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి ఆన్లైన్ ద్వారా మీరు ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు.

దేశంలో ఉన్నటువంటి 27 వేల ఆసుపత్రుల్లో ఈ పథకం ద్వారా సేవలు అందిస్తున్నారు. . ఈ కార్డును ఉపయోగించుకొని ఎక్కడైనా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.

Related News

Gold in smartphones: స్మార్ట్‌ఫోన్‌లో బంగారం ఉందని తెలుసా? ఈ మోడల్స్ లో మరీ ఇంత ఉంటుందా!

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

DMart: డిమార్ట్‌ లో శ్రమించే ఆ సిబ్బంది జీతాలు ఎంతో తెలుసా? నిజంగా షాకవుతారు!

Bank Holidays: కస్టమర్లకు హెచ్చరిక! నాలుగు రోజులు బ్యాంకు సెలవులు

Rapido Fined: యాడ్ పై రచ్చ.. రాపిడోకు రూ.10 లక్షలు ఫైన్

Big Stories

×