BigTV English

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం ఒక కొత్త ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం 24 రూపాయలకే ట్యాక్స్ ఫైలింగ్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జియో ఫైనాన్స్ పేరుతో ఒక యాప్ విడుదల చేసింది. దీని ద్వారా అనేక రకాల టాక్స్ ఫైలింగ్ సర్వీసెస్ అందిస్తోంది. టాక్స్ బండి అనే సంస్థ భాగస్వామ్యంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం టాక్స్ ఫైలింగ్ కి సంబంధించినటువంటి సేవలను అది తక్కువ ధరతో సర్వీస్ అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాంజ నిజానికి ఇది సెల్ఫ్ ఫైలింగ్ చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది సాధారణంగా ఐటిఆర్ – 1 ఫైల్ చేసే వారికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేతనం, లేదా పెన్షన్ ఇలా ఒకే తరహా ఆదాయం పొందే వారికి జియో టాక్స్ ఫైలింగ్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.


అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఏమిటంటే ఎవరైతే కాపిటల్ గెయిన్స్, అలాగే వ్యాపారం చేసేవారు, దీంతోపాటు విదేశీ పెట్టుబడులు పొందేవారికి జియో ఫైనాన్స్ అందిస్తున్న ఈ టాక్స్ ఫైలింగ్ సర్వీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు అని అర్థం చేసుకోవాలి. అయితే టాక్స్ ఫైలింగ్ సర్వీసెస్ కు సంబంధించి అన్ని తరహా సర్వీసులను జియో ఫైనాన్స్ అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం నిపుణుల పర్యవేక్షణలో ఫైలింగ్ చేసుకునే ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు జియో ఫైనాన్స్ అందిస్తున్న 24 రూపాయల టాక్స్ ఫైలింగ్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. . ఈ సర్వీస్ కేవలం ప్రతినెల వేతనం అలాగే పెన్షన్ పొందే ఉద్యోగులు పెన్షనర్లకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఆదాయం పొందేవారు, ఒకే ఇంటి నుంచి అద్దె పొందేవారు, వ్యవసాయ ఆధారం ఉండేవారు ఐటిఆర్ 1, ఐటీఆర్ 2 ద్వారా ఫైల్ చేసేందుకు అర్హత ఉన్నవారు మాత్రమే జియో ఫైనాన్స్ అందిస్తున్న ఈ 24 రూపాయల టాక్స్ ఫైలింగ్ సర్వీసుకు అర్హులు అని చెప్పవచ్చు.


ఐటిఆర్ 3, ఐటిఆర్ 4 అంటే వ్యాపారం ద్వారా కానీ, ప్రొఫెషనల్ ఆదాయం పొందుతున్న వారు ఈ తరహా టాక్స్ ఫైలింగ్ సర్వీస్ పొందేందుకు అర్హులు కారు. అలాగే, షేర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి క్యాపిటల్ గేమ్స్ పొందే వారు కూడా అర్హులు కారు.

జియో ఫైనాన్స్ యాప్ ఎలా పనిచేస్తుంది:
>> ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లి జియో ఫైనాన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ జియో ఫోన్ నెంబర్ తో లాగిన్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ హోమ్ స్క్రీన్ పైన టాక్స్ ఫైలింగ్ విభాగం కనిపిస్తుంది. అందులో మీ ఫారం 16, సహా ఇతర పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది ఆటోమేటిక్ గా మీ వివరాలన్నింటినీ నింపుతుంది. చివరలో డేటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత పేమెంట్ గేటు లోకి వెళ్లి 24 రూపాయలు చెల్లించి మీ టాక్స్ ఫైలింగ్ చేసుకోవచ్చు.

Related News

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

DMart: డిమార్ట్‌ లో శ్రమించే ఆ సిబ్బంది జీతాలు ఎంతో తెలుసా? నిజంగా షాకవుతారు!

Bank Holidays: కస్టమర్లకు హెచ్చరిక! నాలుగు రోజులు బ్యాంకు సెలవులు

Rapido Fined: యాడ్ పై రచ్చ.. రాపిడోకు రూ.10 లక్షలు ఫైన్

DMart: ‘డి-మార్ట్’ అంటే ఏంటి? దాని పేరు వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

×