BigTV English

OTT Movie : ఓటీటీలోకి అడుగుపెట్టిన 4,985 కోట్ల స్పోర్ట్స్ డ్రామా.. సీట్ ఎడ్జ్ స్టంట్స్… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : ఓటీటీలోకి అడుగుపెట్టిన 4,985 కోట్ల స్పోర్ట్స్ డ్రామా.. సీట్ ఎడ్జ్ స్టంట్స్… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ‘ లాంటి యాక్షన్ సీన్స్ తో దుమ్ము దులుపుతున్న ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమాలో బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో అతను 30 సంవత్సరాల తర్వాత తిరిగి రేసింగ్‌లోకి వచ్చి, తన మాజీ టీమ్‌మేట్ అండర్‌డాగ్ టీంని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మతిపోగొడుతున్నాయి. ఈ సినిమా 4,985 కోట్ల అత్యధిక బాక్సాఫీస్ వసూళ్ళు సాధించిన స్పోర్ట్స్ డ్రామాగా నిలిచింది. దీని పేరు ఏమిటి ? ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘ఎఫ్1’ ఒక అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం. దీనికి జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ సోనీ హేస్ అనే ఫార్ములా వన్ రేసర్ గా నటించారు. ఇందులో బ్రాడ్ పిట్, డామ్సన్ ఇడ్రిస్, కెర్రీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం 2025 జూన్ 27న థియేటర్లలో విడుదలై, 2025 ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే

సోనీ హేస్ (బ్రాడ్ పిట్) ఒక అమెరికన్ మాజీ ఫార్ములా వన్ రేసర్. 1990లలో మంచి ఫామ్ లో ఉంటాడు. అయితే 1993 స్పానిష్ గ్రాండ్ ప్రీలో జరిగిన ఒక క్రాష్ అతని కెరీర్‌ను ముగించింది. ఆతరువాత అతడు గ్యాంబ్లింగ్ వ్యసనం, మూడు పెళ్లిళ్ళు ఫెయిల్యూర్ అవ్వడంతో జీవితం మీద విరక్తితో ఉంటాడు. అతను ప్రస్తుతం ఒక చిన్న వ్యాన్‌లో నివసిస్తూ, చిన్న చిన్న రేస్‌లలో పాల్గొంటూ జీవిస్తుంటాడు. అయితే ఈ సమయంలో కష్టాల్లో ఉన్న అండర్‌డాగ్ ఎఫ్1 టీం యజమాని, సోనీని ఒక టెస్ట్ డ్రైవ్ కోసం ఆహ్వానిస్తాడు. అతని టీం మిగిలిన తొమ్మిది గ్రాండ్ ప్రీలలో ఒక్కటైనా గెలవకపోతే ఇన్వెస్టర్లు టీంను అమ్మేస్తారని రూబెన్ భయపడతాడు. ఒక్క విజయంతో మనందరి జీవితాలు మారిపోతాయని చెప్పడంతో సోనీ అయిష్టంగా రేస్ లోకి రావడానికి ఒప్పుకుంటాడు.

ఇప్పుడు సోనీ అండర్‌డాగ్ టీం సభ్యులను కలుస్తాడు. అక్కడ జోషువా అనే రేసర్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాగైనా ఈ రేస్ లో గెలవాలనుకుంటాడు. ఇక సోనీ ఈ కొత్త ఎఫ్1 కారు డ్రైవింగ్‌లో ఇబ్బంది పడతాడు. టెస్ట్ సమయంలో క్రాష్ అవుతాడు. కానీ అతని నైపుణ్యాన్ని గుర్తించిన కాస్పర్ అతన్ని టీంలోకి తీసుకుంటాడు. రేస్ ప్రారంభంలో, అండర్‌డాగ్ టీమ్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీలో నిరాశపరిచే ప్రదర్శన చేస్తుంది. నెమ్మదిగా ఇద్దరు డ్రైవర్లు చివరి స్థానాలకు పడిపోతారు. సోనీ, జోషువా మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. జోషువా వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి పెడితే, సోనీ రేసింగ్ పట్ల ప్రేమతో ఉంటాడు.

గ్రాండ్ ప్రీలో, సోనీ ఎఫ్1 నియమాలను తెలివిగా ఉపయోగించి, ఇతర డ్రైవర్లతో ఢీకొట్టి సేఫ్టీ కార్‌ను రప్పించి, జోషువాకు మిడ్‌ఫీల్డ్‌లోకి చేరే అవకాశం ఇస్తాడు. ఇది అండర్‌డాగ్ టీంకి తొలి పాయింట్స్ అందిస్తుంది. సోనీ జోషువాకు తన పాత-స్కూల్ శిక్షణా పద్ధతులను నేర్పిస్తాడు. గ్రాండ్ ప్రీలో వర్షం కారణంగా, సోనీ జోషువాకు స్లిక్ టైర్లతో రేస్ చేయమని సలహా ఇస్తాడు. ఇది అతన్ని రెండవ స్థానానికి నడిపిస్తుంది. అయితే జోషువా సోనీ సలహాను పట్టించుకోకుండా మాక్స్ వెర్స్టాపెన్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి, క్రాష్ అవుతాడు. అతని కారు మంటల్లో చిక్కుకుంటుంది. ఇంతలో

సోనీ అతన్ని రక్షిస్తాడు. కానీ జోషువా మూడు రేస్‌లకు దూరమవుతాడు. ఇక చివరగా ఈ రేస్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇక ఈ ఎఫ్1 రేస్ లో వీళ్ళు గెలుస్తారా ? సోనీ దశ తిరుగుతుందా ? జోషువా మళ్ళీ తిరిగివస్తాడా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : కళ్ళముందే తండ్రి శిరచ్ఛేదం… ఫ్యామిలీ బహిష్కరణ… ఇది దేవుడికే చుక్కలు చూపించే దెయ్యం మావా

Related News

OTT Movie : ప్రతి 36 సంవత్సరాలకు రీఎంట్రీ… చిన్నపిల్లలను బలి తీసుకునే మంత్రగత్తె… హర్రర్ కి కేరాఫ్ అడ్రస్ ఈ మూవీ

OTT Movie : అండర్ వరల్డ్ డాన్ తో సంబంధం… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే సిరీస్… ఇంకా చూడలేదా ?

OTT Movie : మనిషి మాంసాన్ని పీక్కుతినాలనే ఆకలి… ఈ అక్కాచెల్లెళ్ల అరాచకం చూస్తే గుండె గుభేల్… పోతారు మొత్తం పోతారు

OTT Movie : రిక్షా డ్రైవర్ తో ఇదేం పాడు పనిరా అయ్యా… ప్రొఫెసర్ ప్రైవేట్ వీడియో లీక్ తో అడ్డంగా బుక్… మోస్ట్ కాంట్రవర్సీ మూవీ

OTT Movie : ఒక్క ఈవిల్ తో 12 మంది దేవతల ఫైట్… కానీ చిన్న ట్విస్ట్… కిక్కెక్కించే క్రేజీ కొరియన్ సిరీస్

Big Stories

×