BigTV English
Advertisement

Pets Business : పదింతలుగా పెరుగుతోన్న పెట్స్ బిజినెస్..!

Pets Business : పదింతలుగా పెరుగుతోన్న పెట్స్ బిజినెస్..!
pets business in India

Pets Business In India : చాలా మంది ఐటీ ఉద్యోగులు, ధనవంతులు సరదాగా కుక్కులను పెంచుకుంటారు. వీరిలో చాలా మందికి ఇదో స్టేటస్‌ సింబల్‌గా ఉంది. దేశంలో ఈ బిజినెస్‌ క్రమంగా పుంజుకుంటోంది. పెట్స్‌ క్లినిక్స్‌, వాటి ఫుడ్‌ బిజినెస్‌ ఇప్పటికే దేశంలో వందల కోట్లు దాటిపోయింది. పెట్స్‌ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా కొన్ని రకాల పెట్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటోంది. వీటి రోజువారి పోషణ, వాటి సంరక్షణకు చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. పెట్స్‌ గ్రూమింగ్‌కు డిమాండ్‌ పెరుగుతున్నది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్‌ క్లీనిక్స్‌ హోం సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇంటి వచ్చి పెట్స్‌కు వైద్య సేవలతో పాటు, గ్రూమింగ్‌ సేవలను అందిస్తున్నాయి.


సేవల మార్కెట్‌…
ముంబైలో పూప్‌ ఎన్‌ గూఫ్‌ పేరుతో ఒక పెట్‌ రిసార్ట్‌ ఉంది. యజమానులు తమ పెంపుడు కుక్కలను ఇక్కడి తీసుకు వస్తుంటారు. ఇక్కడ 5 గంటలకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. 24 గంటలకు 11 వందలు వసూలు చేస్తున్నారు. అంతేకాదే ఈ రిసార్ట్‌ నిర్వహకులు పెట్స్‌కు నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. పెట్స్‌ కు ఇక్కడ స్విమ్మింగ్‌ కూడా నేర్పిస్తారు. 8 సెషన్లకు 4 వేలు ఛార్జ్‌ చేస్తున్నారు. పెట్స్‌ పోషణకు చాలా కుటుంబాలు నెలకు 25 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు.

మన దేశంలో డాగ్‌ ఫుడ్‌ మార్కెట్‌ ఏటా 18.89 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నది. 2027 నాటికి పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌ 0.81 బిలియన్‌ కేజీలకు పెరుగుతుందని అంచనా. 2023లో సగటు వినియోగం 0.33 కేజీలుగా ఉంటుందిన అంచనా 2014 నుంచి 2019 వరకు పెంపుడు కుక్కులు, పిల్లలును పెంచే కుటుంబాల సంఖ్య 50 శాతం పెరిగింది. కోవిడ్‌ కొంత ప్రభావం చూపించినప్పటికీ, మళ్లిd ఇది పెరుగుతున్నది. అదే సమయంలో సంవత్సరానికి పెట్స్‌ సంఖ్య 6 లక్షలకు పైగా పెరుగుతున్నది. పెరుగుతున్న వీటి సంఖ్య వీటి ఫుడ్‌ మార్కెట్‌ను కూడా పెంచుతున్నాయి. మన దేశంలో పెట్‌ జనాభా సంఖ్య 32 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఏటా 11 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఒక అంచనా.


ఇక వీటి సంరక్షణకు కూడా యజమానులు భారీగా ఖర్చు చేస్తున్నారు. గ్రూమీంగ్‌, ఎయిర్‌, నైల్‌ కటింగ్‌, మసాజ్‌ వంటి సేవలకు నెలకు సరాసరి 1,150 నుంచి 3,500 వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ సేవల మార్కెట్‌ కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు చాలా మంది తమ పెట్స్‌ను, పెంపుడు పిల్లులను తమతో పాటే కేఫ్‌లకు, రెస్టారెంట్స్‌కు పోతున్నారు. ఇందు కోసం ప్రత్చేక ఏర్పాట్లు ఉన్న ఇలాంటి వాటికి డిమాండ్‌ పెరుగుతున్నది. గతంలో డాగ్స్‌ ప్రధానంగా కాపాలకు ఉపయోగపడేవి. ఇప్పుడు మారిన కాలంలో డాగ్స్‌ను మనుషులు భారీగా ఖర్చు చేసిన మరీ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో పెట్‌ కేర్‌ ఇండస్ట్రీ 569.4 మిలియన్‌ డాలర్ల మేర ఉంది. 2030 నాటికి ఇది 1,932.6 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. పెంపుడు జంతువుల పుడ్‌ మార్కెట్‌లో డాగ్స్‌ ఫుడ్‌ మార్కెట్‌ మూడువంతులు ఉంది.

డాగ్స్‌ యాక్సెసరీస్‌ మార్కెట్‌ కూడా చాలా పెద్దది. పెట్‌ కేర్‌ ఇండస్ట్రీకి 2020లో 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021-22 నాటికి ఈ పెట్టుబడులు 77 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి అనేక విదేశీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయ. మన దేశ మార్కెట్‌లో దాదాపు 80 బ్రాండ్స్‌ 1000కి పైడా ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా పెట్‌ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతున్నది. హెడ్స్‌ ఆఫ్‌ ఫర్‌ టైల్స్‌ అనే సంస్థ పెట్‌ గ్రూమింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ 37 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెటింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 35 సెంటర్లలో ఈ సేవలను అందిస్తోంది.

ఇలాంటి అనేక సంస్థలు పెట్‌ సంరక్షణ బిజినెస్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. డిజిటల్‌ పెట్‌ కేర్‌ స్టార్టప్‌ వెట్రిక్‌ 3.7 మిలియన్‌ డాలర్ల పెట్టబడులు పెట్టింది. మరో పెట్‌ కేర్‌ సంస్థ సూపర్‌ టైల్స్‌ 10 మిలియన్ల పెట్టుబడులు పెట్టింది. ప్రపంచలోనే మన దేశం పెట్‌ కేర్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉందని డెసిఫర్‌ అనే మార్కెటింగ్‌ రిసెర్చ్‌ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 10 శాతం కుటుంబాలు మాత్రమే పెట్స్‌ను కలిగి ఉన్నారని, అదే అమెరికాలో 66 శాతం కుటుంబాలు పెట్స్‌ను పెంచుతున్నారని తెలిపింది. ఇండియాలో పెట్స్‌ను పెంచెె వారి సంఖ్య రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. పెరుగుతున్న ఆదాయాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయని తెలిపింది.

లార్సెన్ అండ్ ట‌ర్బో (ఎల్ &టీ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ అనిల్ మ‌ణిభాయి నాయక్ (ఎఎం నాయ‌క్‌) వచ్చే సెప్టెంబర్ 30న తన పదవినుంచి వైదొలగనున్నారు. ఆ తర్వాత ఆయన సంస్థ గౌర‌వ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. నిన్నటి సంస్థ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుత సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం ఆ తర్వాత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. 1965లో సంస్థలో జూనియర్ ఇంజనీర్‌గా చేరిన నాయక్ 58 ఏళ్ల పాటు ఎల్ &టీ అభివృద్ధికి కృషి చేశారని బోర్డు ఓ ప్రకటన వెల్లడించింది.

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×