Big Stories

AUS vs WI : 6.5 ఓవర్లలోనే ఛేజింగ్.. విండీస్‌పై ఆసీస్ రికార్డ్ విక్టరీ..

Australia vs West Indies 3rd ODI

Australia vs West Indies 3rd ODI : వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆసీస్.. మూడో మ్యాచ్ లో విండీస్ పై రికార్డ్ విజయం సాధించింది. కాన్ బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 24.1 ఓవర్లలోనే 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ జట్టు 6.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

- Advertisement -

విండీస్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఓపెనర్ అథనాజ్ 32 పరుగులు తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోస్టన్ ఛేజ్ (12), కార్టీ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. విండీస్ స్కోర్లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 13 పరుగులే రెండో అత్యధిక స్కోర్.

- Advertisement -

ఆసీస్ బౌలర్లలో జేవియర్ బార్ట్ లెట్ 4 వికెట్లు, లాన్స్ మోరీస్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్ కు ఒక వికెట్ దక్కింది.

87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 6.5 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్ జేక్ ఫీజర్ మెక్ గర్క్ 41 (18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో మెరుపులు మెరిపించాడు. కీపర్ జోష్ ఇంగ్లిష్ (35, 16 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు) తొలివికెట్ కు కేవలం 4.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. ఫీజర్ అవుటైన తర్వాత అరోన్ హార్డీ (2) అవుట్ అయ్యాడు. కెప్టెన్ స్టివ్ స్మిత్ (6, 3 బంతుల్లో ఫోర్ ) లాంఛనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఓషెన్ థామస్ తలో వికెట్ తీశారు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ , ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఆసీస్ పేసర్ బార్ట్ లెట్ కు దక్కాయి.

ఈ మ్యాచ్ కేవలం 31 ఓవర్లలోనే ముగిసింది. వన్డే చరిత్రలో 6వ షార్టెస్ట్ మ్యాచ్ గా రికార్డు నమోదు చేసింది. ఆసీస్ 259 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. ఆసీస్ గడ్డపై అతితక్కువ ఓవర్లలో ముగిసిన వన్డే ఇదే కావడం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News