BigTV English

Festive Discounts: పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Festive Discounts: పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Festive Discounts On Popular Sedans: భారతీయ మార్కెట్లలో SUVల జోరు పెరిగిన నేపథ్యంలో సెడాన్ల వినియోగం తగ్గిపోతోంది. కొంత మంది వినియోగదారులు సెడాన్లను ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు తమ సెడాన్ల అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆటో మోబైల్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, ఫోక్స్‌ వ్యాగన్ వర్టస్ లాంటి పాపులర్ మోడల్స్ కొనుగోలుపై తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి.


హ్యుండాయ్ ఆరా

మారుతి సుజుకి డిజైర్ లాంటి మోడల్ కు గట్టి పోటీ ఇస్తున్న కారు హ్యుండాయ్ ఆరా. హ్యుండాయ్ ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ గా బాగా పాపులర్ అయ్యింది. పండుగ సీజన్‌లో ఈ కారు కొనుగోలుపై రూ. 48,000 వరకు తగ్గింపు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్, CNG వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.


హ్యుండాయ్ వెర్నా

ఇండియన్ మార్కెట్లో మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో సరికొత్త మోడల్ హ్యుందాయ్ వెర్నా. ఈ కారుపై రూ. 50,000 వరకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సెడాన్ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ తో పాటు 1.5 లీటర్ tGDi పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. CVT ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌ బాక్స్ తో వస్తుంది.

హోండా అమేజ్

న్యూ జెనరేషన్ అమేజ్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుత హోండా అమేజ్ పై పండుగ ఆఫర్ లో భాగంగా  కంపెనీ ఏకంగా రూ. 1.12 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ మోడల్ పై ఈ ఆఫర్ వర్తింపజేస్తోంది. అమేజ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

హోండా సిటీ

వోక్స్‌ వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హ్యుండాయ్ వెర్నా లాంటి కార్లకు పోటీగా, హోండా కంపెనీ ప్రముఖ సెడాన్ పై ఏకంగా రూ. 1.14 లక్షల తగ్గింపు ధరను అందిస్తోంది. 5వ జెనరేషన్ హోండా సిటీ ప్యూర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ e:HEV రూపాల్లో అందుబాటులో ఉంది. విశాలమైన క్యాబిన్, ఫీచర్ లోడెడ్ క్యాబిన్, రిలయబుల్ పవర్‌ ట్రెయిన్ ను కలిగి ఉంది.

వోక్స్‌ వ్యాగన్ వర్టస్

ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీ వోక్స్‌ వ్యాగన్ సైతం భారీగా తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన వోక్స్‌ వ్యాగన్ వర్టస్ పండుగ సీజన్‌ లో భాగంగా 1.2 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సెడాన్ 1.0 లీటర్ 3-సిలిండర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5 లీటర్ నాలుగు-సిలిండర్ TSI EVO పెట్రోల్ ఇంజన్‌ తో అందుబాటులో ఉంది. ఆఫర్‌ లో ఉన్న ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT యూనిట్ కలిగి ఉన్నాయి. కొత్తకారు కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారులు ఇదో మంచి అవకాశంగా భావించవచ్చు.

Read Also: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

Related News

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Big Stories

×