E-Paper
Advertisement

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?
Advertisement

Former TTD Chairman Bhoomana Karunakar Reddy Visits Tirumala: ప్రస్తుతం ఏపీలో తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తమకు వెంటనే నివేదికను సమర్పించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ విచారణ చేయనున్నది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మధ్య ఈ విషయమై రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతుంది. లడ్డూ కల్తీ కావడానికి కారకులు మీరేనంటూ ప్రస్తుత ప్రభుత్వం.. లేదు లేదు మా పాలనలో అలాంటిదేమీ జరగలేదంటూ వైసీపీ నేతలు.. ఇలా వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Advertisement

ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుమలను సందర్శించారు. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో మునిగి ఆయన ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడొద్దని అందులో పేర్కొన్నారు.

Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×