Middle Class Nirmala Sitharaman| ఒక వ్యక్తి జేబులో రూ.500 పెట్టుకొని మార్కెట్ కు వెళితే.. సంచి నిండా కూరగాయలు రావడం లేదు. సగం నిండిన సంచితో ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితి. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతున్నాయి. సూపర్ మార్కెట్ కు వెళితే.. పప్పు, బియ్యం, వంటనూనె ధరలు వారానికోసారి పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. వార్తల్లో కూడా అప్పుడప్పుడూ దీని గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కానీ పెరుగుతున్న ధరలకు సమానంగా ప్రజల ఆదాయం పెరుగుతోందా? అంటే లేదు అనే సమాధానం మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. ఏ మీడియా చానెల్, ప్రభుత్వ డేటా ప్రజల ఆదాయం పెరగడం లేదు అని చెప్పదు. అయితే ఈ సమస్య వల్ల ఎక్కువగా నష్టపోయేది మధ్య తరగతి ప్రజలు. సామాన్యులు. వారికి మాత్రమే ఈ సమస్య పెనుభూతంలా కనిపిస్తుంది. మధ్య తరగతి ప్రజలు మాత్రమే మార్కెట్‌కు వెళ్లినప్పుడు ప్రతి వస్తువు ధరను గమనిస్తూ ఉంటారు. జేబులో డబ్బులు ఎన్ని ఉన్నాయని సరి చూసుకుంటూ నిత్యావసరాలు కొనుగోలు చేసే స్థాయికి మధ్య తరగతి బ్రతుకులు పడిపోయాయి.
ఈ విషయాన్నే ఒక ట్విట్టర్ యూజర్ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు గుర్తు చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై కేంద్ర మంత్రి సీతారామన్ కూడా స్పందించడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. పేమానంద్ అనే ఎక్స్ యూజర్.. మధ్య తరగతి, సామాన్య ప్రజల కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోదు. సామాన్యుల నుంచి వసూలు చేసే పన్నులు, జిఎస్ టీ పైనే భారతదేశ ప్రభుత్వం నడుస్తోంది. అందుకే వారి నుంచి ఏదీ ఆశించకూడదు. అని నిరుత్సాహంగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని ట్యాట్ చేస్తూ.. తుషార్ శర్మ అనే మరో యూజర్ ఒక పోస్ట్ చేశాడు. “దేశ అభివృద్ధి కోసం మీరు పడే శ్రమ ప్రశంసనీయం. కానీ నాది ఒక హృదయపూర్వక చిన్న మనవి. మధ్యతరగతికి ఉపశమనం కలిగించండి. మీరు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోగలను. కానీ ప్రార్థనను స్వీకరించండి” అని రాశాడు.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
అంతకుముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. సమాజంలో మహిళల ప్రాముఖ్యత గురించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ. తుషార్ శర్మ ఈ పోస్ట్ చేశాడు. అయితే తుషార్ శర్మ ట్వీట్ పై నిర్మలా సీతారామన్ స్పందించారు. “మీరు చేసిన మనవిని అర్థం చేసుకోగలను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా పరిపాలన సాగిస్తోంది. ప్రజల సమస్యలను తప్పకుండా వింటోంది. మీరు చేసిన ట్వీట్ చాలా విలువైనది. మీకు నా అభినందనలు” అని సీతారామన్ తన ట్వీట్ లో రాశారు.
నిత్యవసరాత ధరలు పెరిగిపోవడానికి గల ముఖ్య కారణం. ద్రవ్యోల్బణం. దేశంలోని రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అక్టోబర్ లో 6.21 శాతం ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన స్థాయి కంటే చాలా ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 9.24 శాతం ఉండగా.. అక్టోబర్ నెలలో 10.87 శాతానికి పెరిగిందని జాతీయ అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ గణాంకాలు భయంకరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసరల ధరలు పెరిగిపోవడంతో మధ్య తరగతి, పేద ప్రజలు సరైన పౌష్టికాహారానికి దూరమవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలీ చాలని నెలజీతంతో ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యకు పరిష్కారం చూపూ బాధ్యత నుంచి ప్రభుత్వం ఎక్కువ కాలం తప్పించుకోలేదని హెచ్చరిస్తున్నారు.
Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.
PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024