Stock Market: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టాక్‌ల అమ్మకాలు ఒత్తిడికి గురైనా భారతీయ సంస్థలు AI రంగంలో ప్రమేయం పరిమితంగా ఉండటంతో దేశీయ మార్కెట్ జోరందుకుంది. ఫలితంగా శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే వరకు అదే జోరు కొనసాగింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ, నిఫ్టీలు బెంచ్ మార్క్‌ని మరోసారి టచ్ చేశాయి.
అమెరికా మార్కెట్లో భారీ నష్టాలతో పతనం కావడంతో దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ పై పడుతుందని చాలామంది అంచనాలు వేశారు. కానీ అస్సలు పడలేదు. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన తొలి పావుగంట సేపు కాస్త ఒడుదుడుకులకు లోనైంది. అక్కడి నుంచి సెన్సెక్స్ జోరు పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1718 పాయింట్లు పెరిగింది. అంటే దాదాపు 2.17 శాతం పెరిగి 81,028 వేల మార్క్ వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా తన మార్క్‌ని మళ్లీ టచ్ చేసింది. 493 పాయింట్లు పెరిగింది. అంటే 2 శాతం పైగానే పెరిగి 25,030 వేల మార్క్‌కి మళ్లీ దక్కించుకుంది. ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 6,063 పాయింట్లు లేకుంటే 8.27 శాతం పెరిగింది. అటు నిఫ్టీ 1837 పాయింట్లు పెరిగి 8 శాతం ఎగబాకింది. ఒక విధంగా చెప్పాలంటే రెండురోజులు ముందుగానే మదుపరులకు దీపావళి పండగ వచ్చేసింది. ఐటీ, బ్యాకింగ రంగాల షేర్లు జోరందుకున్నాయి. బ్యాంకింగ్ సూచీ 2.2 శాతానికి పైగా పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏకంగా 3. 7 శాతం పెరిగింది.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత పెట్టుబడిదారులు యూ టర్న్ తీసుకున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు-ఎఫ్‌ఐఐలు గురువారం రూ. 14,974 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. 2021 ఫిబ్రవరి 24 తర్వాత ఒక్క రోజు ఈ స్థాయిలో కొనుగోలు చేశారు. తగ్గుతున్న ముడి చమురు ధరలు, ఏఐ సంబంధిత స్టాక్‌ల నుండి పెట్టుబడులు మళ్లడంతో విదేశీ పెట్టుబడి దారులను భారతీయ మార్కెట్ ఆకట్టుకుంది.
ALSO READ: పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!
ఇన్ఫోసిస్ , టీసీఎస్ సహా భారతీయ ఐటీ కంపెనీల షేర్లు దాదాపు 3 శాతం వరకు పెరిగాయి. దేశీయ మార్కెట్‌కు మాంచి మద్దతు ఇచ్చింది. ప్రపంచ టెక్నాలజీ కంపెనీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించిన ఆందోళనల నేపథ్యంలో భారతీయ ఐటీ స్టాక్‌లు AI వ్యతిరేక ప్రయోజనాన్ని కలిగి ఉన్నట్లుగా పరిగణించారు మదుపరులు. గతరాత్రి నాస్‌డాక్ కాంపోజిట్ 6 శాతం పతనమైంది. 2020 తర్వాత ఒకే రోజులో అత్యంత భారీ పతనం ఇది.