E-Paper
Advertisement

పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!

పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!
Advertisement

NPCI UPI Safety Tips: పండుగ వేళ ఆన్‌లైన్ షాపింగ్ జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, వ్యాపార లింక్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఓటీపీల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల పర్యవేక్షణ సంస్థ ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (NPCI) యూపీఐ యూజర్లను అప్రమత్తం చేసింది. కీలక రక్షణ సూత్రాలను విడుదల చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తుగడలు

సాధారణంగా పండుగ వేళల్లో కొనుగోలు దారుల్లో ఒకవిధమైన టెన్షన్ ఉంటుంది. ఆఫర్ ను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వినియోగదారుల ఈ ప్రవర్తననే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని NPCI పేర్కొంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయని గుర్తుచేసింది. మోసాల పట్ల అవగాహన, అప్రమత్తతతో వ్యవహరిస్తే కష్టపడిన సొమ్మును సైబర్ నేరస్థుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన 5 నియమాలను ప్రస్తావించింది.

అపరిచిత లింక్‌లు తాకొద్దు

Advertisement

పండుగ ఆఫర్లు, గ్రీటింగ్ కార్డులు, కానుకల పేరుతో వాట్సాప్, మెసేజ్‌లు, ఈమెయిళ్లలో వచ్చే అపరిచిత లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని NPCI సూచించింది. అలాగే తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని హితవు పలికింది. ఇటువంటి లింక్‌లు నకిలీ వెబ్‌సైట్లకు దారితీయడమే కాకుండా.. ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి హానికరమైన వైరస్‌లను పంపి వ్యక్తిగత డేటాను చోరీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

యాప్ దాటి బయటకు వెళ్లొద్దు

కొందరు కేటుగాళ్లు తక్కువ ధరకే వస్తువులు ఇస్తామని నమ్మించి షాపింగ్ యాప్ పరిధిలో కాకుండా ప్రైవేటు లింక్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయాలని సూచిస్తుంటారని ఎన్ పీసీఐ తెలిపింది. ఇలాంటి చెల్లింపులకు భద్రతాపరమైన తనిఖీలు ఉండవని పేర్కొంది. కాబట్టి ఎల్లప్పుడూ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ పేజీలోనే లావాదేవీలు పూర్తి చేయాలని హితవు పలికింది. పేమెంట్ చేసే ముందే ఒకటికి రెండుసార్లు ఎవరికి చెల్లిస్తున్నామో సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.

ఉచితాల వెనుక ఉచ్చులు..

Advertisement

ఉచిత వోచర్లు, భారీ క్యాష్‌బ్యాక్‌లు పేరుతో వచ్చే సందేశాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఎన్ పీసీఐ సూచించింది. ఈ ఆఫర్లను క్లెయిమ్ చేసుకోవడానికి ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే వారితో మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. ఏ కంపెనీ కూడా ఆఫర్ల పేరిట ముందస్తుగా డబ్బులు డిమాండ్ చేయదని స్పష్టం చేసింది. అసలు ఆఫర్ నిజమో కాదో సంబంధిత అధికారిక యాప్‌లో చెక్ చేసుకున్నాకే తర్వాతి ప్రక్రియలోకి వెళ్లాలని సూచించింది.

ఓటీపీనే రక్షణ కవచం

చెల్లింపు విఫలమైందని, ఖాతా బ్లాక్ అయిందని బెదిరిస్తూ.. సమస్య పరిష్కారం కోసం ఓటీపీ చెప్పాలని వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకులు లేదా డిజిటల్ పేమెంట్ యాప్‌లు ఎప్పుడూ ఓటీపీని అడగవు. యూజర్లు తాము స్వయంగా చేసే లావాదేవీల ధృవీకరణ కోసం మాత్రమే ఓటీపీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దని ఎన్ పీసీఐ సూచించింది.

Also Read: Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

ఆందోళన వద్దు… ఆలోచనే ముద్దు

ఆఫర్ గడువు ముగిసిపోతుందని కొన్ని సందర్భాల్లో సైబర్ నేరస్తులు కంగారు పెట్టే అవకాశముందని ఎన్ పీసీఐ తెలిపింది. తొందరపాటులో వినియోగదారులు పొరపాట్లు చేస్తారనేదే వారి వ్యూహమని పేర్కొంది. నిజమైన ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను భయపెట్టవని స్పష్టం చేసింది. కాబట్టి ఏదైనా అనుమానం వస్తే ముందుగా అధికారిక కస్టమర్ కేర్ లేదా వెబ్‌సైట్ ద్వారా సదరు సమాచారాన్ని కన్ఫామ్ చేసుకోవాలని ఎన్ పీసీఐ హితవు పలికింది.

Also Read: దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

Tags

Related News

దలాల్ స్ట్రీట్‌లో దీపావళి పండగ.. ఫుల్‌జోష్‌లో మదుపరులు, పాత మార్క్‌ని టచ్ చేసిన సెన్సెక్స్-నిఫ్టీలు

దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌లో ఈ పొరపాటు చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వాల్‌‌స్ట్రీట్‌లో బేర్ వీర విహారం..ఆరేళ్ల తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ భారీ పతనం, వెంటాడిన ఏఐ భయాలు

దీపావళి బోనస్ వచ్చిందా? డబ్బంతా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ఇలా చేయండి

దీపావళి బిజినెస్ ఐడియా.. కేవలం రూ.10000తో కొవ్వత్తుల వ్యాపారం.. ఇలా చేస్తే భారీ ఆదాయం

ఏటీఎంలకు కొత్త రూల్స్.. అమలు చేస్తున్న ఒక్కో బ్యాంకు, లబోదిబోమంటున్న కస్టమర్లు

Big Stories

Advertisement
×