Employee Diwali Gifts: సాధారణంగా ప్రతి ఏటా దీపావళికి కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్స్, న్నర్ సెట్ల లాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. అయితే దేశ రాజధాని దిల్లీకి చెందిన ఓ కంపెనీ మాత్రం తమ సిబ్బందిని ఊహించని రీతిలో ఆశ్చర్యపరిచింది. ఏకంగా అత్యంత ఖరీదైన ‘ఐఫోన్ 16’ (iPhone 16) స్మార్ట్‌ఫోన్లను బహుమతిగా అందించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తమ కార్యాలయంలో దీపావళి వేడుకలకు సంబంధించిన విజువల్స్‌ను ‘ఫైనాన్సర్ సాబ్’ (Finacer Saab) కంపెనీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ చిన్న వీడియోలో.. ఉద్యోగులు పనిచేసే కంప్యూటర్ డెస్క్‌ల ముందు అందంగా రిబ్బన్లు కట్టిన తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల ఐఫోన్ 16 బాక్సులు ప్రత్యక్షమయ్యాయి. ఊహించని ఈ కానుకను చూసి మహిళా ఉద్యోగులు ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
?utm_source=ig_embed&ig_rid=AO05OhcWTD5gTEbith73tli
‘మాకు పోటీయే లేదు.. ఇంతకీ మీకు దీపావళికి ఏమి లభించింది?’ అనే క్యాప్షన్‌తో కంపెనీ ఈ వీడియోను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ చేసిన స్వల్ప వ్యవధిలోనే వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఉద్యోగులపై యాజమాన్యం చూపిన ప్రేమ, అభిమానాన్ని ప్రశంసిస్తున్నారు.
ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు యూజర్లు ‘ఇది నిజమేనా? ఏఐతో సృష్టించిన వీడియోనా?’ అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. సరదాగా నవ్వుతూ వీడియోను మరోసారి సరిగ్గా చూడాలని ఇది ఎలాంటి ఏఐ ప్రయోగం కాదని స్పష్టం చేసింది.
Also Read: రెండో వన్డేకు 60% వర్షం ముప్పు.. దేవుడు కూడా ఇండియాను కాపాడలేడంటూ తన్వీర్ సంచలనం
అయితే కొందరు నెటిజన్లు ‘మీ కంపెనీలో ఏవైనా ఖాళీలు ఉన్నాయా? మేం కూడా జాయిన్ అవుతాం’ అని కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్ ‘ఇలాంటి వీడియోలు చూశాక కుళ్ళుకోకుండా ఉండాలంటే దీపావళికి ఇన్‌స్టాగ్రామ్ వాడటం ఆపేయాలి’ అని జోక్ చేశారు. మహిళలకు ఐఫోన్లు ఇస్తే పురుష ఉద్యోగులకు బంగారు నాణాలు ఇచ్చి ఉంటారని ఇంకొకరు సెటైర్ వేయగా.. తమ కంపెనీ కనీసం ఒక సోన్ పాపిడీ బాక్స్ కూడా ఇవ్వలేదని పలువురు తమ బాధను వెల్లబుచ్చుకున్నారు.
Also Read: ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు.. నెలాఖరుకు జీతం!