E-Paper
Advertisement

స్పైడర్‌మ్యాన్, హల్క్, పనిషర్ ఒకే స్క్రీన్‌పై… థియేటర్లలో పూనకాలు తెప్పించిన మూవీ నేటి నుంచే ఓటీటీలో

స్పైడర్‌మ్యాన్, హల్క్, పనిషర్ ఒకే స్క్రీన్‌పై… థియేటర్లలో పూనకాలు తెప్పించిన మూవీ నేటి నుంచే ఓటీటీలో
Advertisement

Spider Man Brand New Day on OTT : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులకు ఇంతకంటే పెద్ద పండగ ఏముంటుంది? ఒకవైపు స్పైడర్‌మ్యాన్ సరికొత్త అవతారంతో అదరగొడుతుంటే, అదే స్క్రీన్‌పై సూపర్ హీరో హల్క్ (Hulk), మోస్ట్ వయలెంట్ యాంటీ హీరో పనిషర్ (Punisher) కలిసి విలన్ల భరతం పడితే ఆ కిక్కే వేరు!. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది భారీ యాక్షన్ విజువల్ వండర్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day). ఇప్పటి వరకు ఓటీటీలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ తో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈసారి పీటర్ పార్కర్‌కు ఒంటరితనంతో పాటు కొత్త సమస్యలు కూడా ఎదురవుతాయి. తనను ప్రపంచం మొత్తం మర్చిపోయిన తర్వాత, ఎవరికీ తెలియకుండా సిటీని కాపాడుతున్న అతడికి ఇప్పుడు హల్క్, పనిషర్ వంటి పవర్‌ఫుల్ పాత్రలు తోడవుతాయి. వీళ్లంతా కలిసి ఒక కనిపించని శత్రువును ఎదుర్కోవాల్సి వస్తుంది. టామ్ హాలండ్, జెండాయా నటించిన ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రంలో ఈసారి పీటర్ పార్కర్‌కు ఎదురైన సమస్య ఏంటి? హల్క్, పనిషర్ అతడికి ఎలా సాయపడ్డారు? తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే..

‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ సినిమా చివర్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన మంత్రం కారణంగా ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మర్చిపోతుంది. అతడి స్నేహితులు ఎంజే, నెడ్ కూడా పీటర్ ఎవరో గుర్తుపట్టలేరు. అక్కడి నుంచి నాలుగేళ్ల తర్వాత ఈ కథ మొదలవుతుంది. అందరూ తనను మర్చిపోయినా, పీటర్ మాత్రం తన బాధ్యతను వదులుకోడు. న్యూయార్క్ నగరంలో ఒంటరిగా ఉంటూ స్పైడర్ మ్యాన్‌గా ప్రజలను కాపాడుతుంటాడు. అయితే స్నేహితులకు దూరమై, తన గురించి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అతడిని మానసికంగా కుంగదీస్తుంది.

Advertisement

ఈ ఒత్తిడి కారణంగా పీటర్ శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అతడి స్పైడర్ శక్తులు కూడా అదుపు తప్పే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే సమయంలో నగరంలో కనిపించని శత్రువు వల్ల కొత్త ముప్పు మొదలవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పీటర్ హల్క్‌గా మారగల బ్రూస్ బ్యానర్ సహాయం కోరతాడు. మరోవైపు నేరస్తులపై కఠినంగా వ్యవహరించే పనిషర్‌తోనూ అతడికి ఎదురుపడుతుంది. మొదట ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నా, ఒకే శత్రువును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి తన శక్తులను తిరిగి అదుపులోకి తెచ్చుకుంటూ, నగరాన్ని కాపాడటంలో పీటర్ విజయం సాధించాడా? తనను మర్చిపోయిన స్నేహితుల మధ్య మళ్లీ తన స్థానాన్ని ఎలా వెతుక్కున్నాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.

తెలుగులోనూ స్ట్రీమింగ్

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) 2026 నవంబర్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మీకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేకపోతే, అమెజాన్ ప్రైమ్ వీడియో (₹119), జీ5 (₹99) ప్లాట్‌ఫామ్‌లలో కూడా తెలుగు ఆడియోతో అద్దెకు తీసుకొని చూడవచ్చు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.52 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో ₹23,000 కోట్లకు పైగా) వసూలు చేసి, సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మన దేశంలోనూ ఈ సినిమా ₹500 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టగా, అందులో కేవలం తెలుగు వెర్షన్ నుంచే సుమారు ₹16.71 కోట్లు వసూలయ్యాయి. 2026 జూలై 30 న తెలుగు, ఇంగ్లీష్ సహా పలు భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదలైందిన ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత 2026 అక్టోబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అద్దెకు (Rent) అందుబాటులోకి రాగా, ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో పూర్తిస్థాయి స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి తోడు 10 నిమిషాల అదనపు సన్నివేశాలతో కూడిన ఎక్స్‌టెండెడ్ కట్ వెర్షన్ 2026 డిసెంబర్ 4 న ఎంపిక చేసిన థియేటర్లలో మళ్ళీ విడుదలవుతోంది.

Advertisement

Read Also: మంచు తుఫానులో లవ్ బర్డ్స్… సడెన్‌గా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ

Tags

Related News

స్కూల్‌కు వెళ్లాలంటేనే వణికిపోయే పిల్లాడు… మామయ్య ఎంట్రీతో హీరోగా మారితే… ఓటీటీలో సూపర్ హిట్ మూవీ

చావు అంచున ఆడిన చివరి ఆట… గుండెను బరువెక్కించే వార్ డ్రామా ఓటీటీలోకి

5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

మనుషుల్లా కనిపించే రెప్లికెంట్స్‌… తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్

తోడు కావాలంటూ బుట్ట బొమ్మ తో ప్రేమ పెళ్లి… ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

జూనియర్‌తో పరిచయం… సీనియర్‌తో ఆ పని… క్రేజీ కొరియన్ ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×