BigTV English

New Maruti Suzuki DZire: పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్

New Maruti Suzuki DZire: పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్

New Maruti Suzuki DZire Set To Launch This Diwali: భారత్ లో అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి సందర్భంగా ఆటో మోబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకునేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ కార్లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుండగా, మరికొన్ని సంస్థలు సరికొత్త కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో మారుతి సుజుకి కూడా చేరింది. భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకున్న డిజైర్ కారును సరికొత్త అప్ డేట్స్ తో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ లో కీలక మార్పులు చేర్పులు చేయబోతోంది. దీపావళికి ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కంపెనీ.


2024 మారుతి డిజైర్ డిజైన్

సరికొత్త మారుతి సుజుకి డిజైర్ హార్ట్‌ టెక్ ప్లాట్‌ ఫారమ్‌ నుంచే రెడీ అవుతున్నా, ప్రత్యేకమైన ఎక్టీరియర్ డిజైన్ కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. గత మోడల్స్ మాదిరి కాకుండా కొత్త డిజైర్ మరింత ప్రత్యేకమైన లుక్ ను సంతరించుకోనుంది.   ఇందులో ఆడి ఎస్క్యూ నోస్, బ్లాక్-అవుట్ హారిజెంటల్ స్లాట్ తో రూపొందించిన గ్రిల్, స్లిమ్ హెడ్‌లైట్లు, స్పోర్టియర్ ఫ్రంట్ బంపర్ ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు, ర్యాప్‌ రౌండ్ LED టెయిల్ లైట్లు మంచి లుక్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


2024 మారుతి డిజైర్ ఇంటీరియర్స్

కొత్త కారులో ఇంటీరియర్‌లో ఎక్కువ భాగం స్విఫ్ట్‌ ను పోలి ఉంటుంది. ఈ కారు మరింత ఓపెన్ గా చక్కటి అనుభూతి కలిగించేలా లైటర్ కలర్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్‌ ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌ లో ఇలాంటి డిజైన్ తో వస్తున్న తొలికారు ఇదే కావడం విశేషం. 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లు కస్టమర్లకు డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

Read Also:అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

2024 మారుతి డిజైర్ ఇంజిన్ ప్రత్యేకతలు

సరికొత్త మారుతి డిజైర్ లో  1.2-లీటర్, 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ కారు పెట్రోల్ మోడ్‌లో 82hp,  112Nm టార్క్‌ ను అటు CNGలో 69.75hp, 101.8Nm టార్క్‌ ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్,  ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను అందిస్తుంది.

 2024 మారుతి డిజైర్ ప్రారంభం, ధర

కొత్త డిజైర్ ను కంపెనీ దీపావళికి విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ కారు ధ రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.34 లక్షల(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుందని ఆటో మోబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత డిజైర్ కంటే కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Read Also:పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×