Instagram Editis App: ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కేవలం ఫొటోలు షేర్ చేసే ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు. ప్రొఫెషనల్ లెవెల్ వీడియో సృష్టికర్తల కోసం కీలక ఫీచర్లతో కూడిన యాపును అందిస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 22, 2025 మెటా అధీనంలోని ఇన్‌స్టాగ్రామ్ ‘Edits’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ యాప్ ప్రత్యేకంగా క్రియేటర్ల కోసం రూపొందించబడింది. కానీ, ఇది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లకు పరిమితం కాకుండా, యూట్యూబ్, టిక్‌టాక్, షార్ట్ వీడియోలు క్రియేట్ చేసుకునేందుకు ఇది అనువైనదని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Edits యాప్‌లో ఉన్న ప్రత్యేకతలు
ఇది కేవలం ఒక వీడియో ఎడిటింగ్ యాప్ కాదు. ఇది సృజనాత్మకతకు చక్కని రంగులు అద్దే ఒక మల్టీ టూల్. ఇందులో ఉండే ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం. హై-క్వాలిటీ వీడియో క్యాప్చర్, క్రియేటర్లు 10 నిమిషాల పాటు హై రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ రేట్, డైనమిక్ రేంజ్ ట్యూనింగ్ వంటి సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.
కస్టమ్ రిజల్యూషన్
ఈ ఆప్షన్లతో సినిమాటిక్ లెవెల్ కంటెంట్ సృష్టించుకోవచ్చు. దీనిలో DSLR మాదిరిగా వీడియో తీసినట్లుగా మార్చుకోవచ్చు.
AI ఆధారిత ఎడిటింగ్ మేజిక్
-స్టిల్ ఇమేజ్‌లను లైవ్ వీడియోలుగా మారుస్తుంది
-గ్రీన్ స్క్రీన్ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడం సులభం
-వీడియో ఓవర్‌లేలు, ఎఫెక్ట్స్‌లు కూడా చక్కగా అమర్చుకోవచ్చు
-సంవత్సరాల ఎడిటింగ్ అనుభవం లేకుండానే, AI ద్వారా ప్రొఫెషనల్ కంటెంట్ తయారవుతుంది.
ఆటో కాప్షన్స్ & ఆడియో క్లారిటీ
-కంటెంట్ వినిపించకపోతే వ్యర్థమే
-ఆటోమేటిక్ కాప్షన్ జనరేషన్‌తోపాటు, మానవీయంగా ఎడిట్ చేసుకునే వీలూ ఉంది.
-బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిమూవల్ ద్వారా శబ్ద నాణ్యత అద్భుతంగా ఉంటుంది
-ఇవి ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
Read Also: Redmi Watch Move: వచ్చేసింది పవర్ ఫుల్ స్మార్ట్ వాచ్.. ..
ఇన్‌సైట్ డాష్‌బోర్డ్
-మీ వీడియోలను ఎవరెన్ని సార్లు చూశారు? ఎవరెన్ని సెకన్లకు స్కిప్ చేశారు?
-ఫాలోవర్స్ vs నాన్-ఫాలోవర్స్ ఎనాలిటిక్స్
-ఎంగేజ్‌మెంట్ రేటు
-స్కిప్, రీప్లే, షేర్ మెట్రిక్స్
-ఈ డేటా ద్వారా కంటెంట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు.
వాటర్‌మార్క్ లేకుండా ఎగ్జిపోర్ట్
-ఇది నిజంగా ఒక గొప్ప బోనస్ అని చెప్పవచ్చు
-మీ బ్రాండ్ గుర్తింపును పెంచుకోవాలంటే, వాటర్‌మార్క్‌లను తొలగించగలగడం తప్పనిసరి. ఈ యాప్ ఆ అవకాశాన్ని కూడా ఇచ్చింది.
ఎవరి కోసం ఈ యాప్?
-కంటెంట్ క్రియేటర్లు కోసం
-వీడియోలను సులభంగా రూపొందించేందుకు, ప్రచురించేందుకు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై పంచుకునేందుకు ఇది ఆదర్శమైన టూల్.
-ఇన్‌ఫ్లుయెన్సర్లు కోసం
-ఎంగేజ్‌మెంట్ పెంచడం, ఫాలోవర్స్‌ను ఆకట్టుకోవడం, ట్రెండింగ్‌లో ఉండడం ఇవన్నీ ఈ యాప్‌తో సులభమే.
బ్రాండ్స్ కోసం
ప్రొడక్ట్ డెమోలు, మార్కెటింగ్ వీడియోలు, క్యాంపెయిన్‌ల కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
డౌన్‌లోడ్ వివరాలు
-ఈ యాప్ ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంది.
-iOS వాడేవారికి: అపిల్ యాప్ స్టోర్‌లో ‘Edits’ పేరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-Android వాడేవారికి: గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Edits’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు