Actress Amani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, సినిమాలు.. అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ లో నటిస్తూ వస్తున్నారు. అందులో ఒకరు ఆమని.. మావి చిగురు వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీలలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి మెల్లగా దూరం అయ్యింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు సీరియల్స్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. చిరంజీవి గురించి ఓ నిజాన్ని బయటపెట్టింది. వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలు జరిగాయా అన్న వార్తల పై క్లారిటీ ఇచ్చింది.
చిరంజీవి vs ఆమని.. గొడవలా..?
ఈమధ్య తెలుగు సినిమా యాక్టర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ యాక్టర్లు ఇస్తున్న ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఈ హీరోయిన్ ఆమెని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె తన పర్సనల్ విషయాల గురించి బయటపెట్టారు. అంతేకాదు సినిమాలకు కొద్ది రోజులు దూరం అవడానికి కారణాన్ని వివరించారు. ఈ క్రమంలో చిరంజీవి సినిమాని వదులుకోవడానికి ఏం జరిగిందో అన్న విషయాన్ని బయట పెట్టారు. ఆమెని మాట్లాడుతూ.. మావిచిగురు సినిమాలో నా నటనకి చాలామంది ఆకర్షితులయ్యారన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత నాకు వరుసగా ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి నటిస్తున్న రిక్షావోడు సినిమా కూడా నాకు ఆఫర్ వచ్చిందని అవని అన్నారు. సౌందర్య ఫోన్ చేసి నాకు ఈ విషయాన్ని చెప్పడంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ నన్ను అనుకున్న ప్లేస్ లో హీరోయిన్ నగ్మా ని తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందని మా మేనేజర్ ని కనుక్కుంటే ఆ సినిమా డైరెక్టర్ మారారని చెప్పడంతో నేను సైలెంట్ అయిపోయానని ఆమెని బయటపెట్టారు. చిరంజీవికి ఆమెకి ఎటువంటి గొడవలు లేవని జరిగిన విషయం ఇది అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read :
ఆమని సినిమాలు..
హీరోయిన్ ఆమని వి వి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకడిపంబ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ భారీ విషయన్ని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఆమని వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమా ఆఫర్స్ తలుపు తట్టాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది.. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమని సినిమాల్లో కీలకపాత్రలో నటించడంతో పాటు ఇటు బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..