Hyderabad: హైదరాబాద్ జీడి మెట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. జీడి మెట్లలోని సాయిదత్త రెసిడెన్సీలో నిందితులు ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ సమయంలో వారి నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 72 కోట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో శివరామకృష్ణ పలు కంపెనీల్లో పని చేస్తూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ తయారీకి దిగినట్టు ఈగల్ టీం గుర్తించింది. నిందితులు శివరామకృష్ణ, ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.