ARI Movie Review : అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్ వంటి వాళ్ళు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అరి’. ఈరోజు పెద్దగా చప్పుడు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
మనిషిలో ఉండే 6 రకాల తత్వాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వంటి వాటిని ఆధారం చేసుకుని తీసిన కథ ఇది.షాదాబ్ హోటల్‌లో టీ మాస్టర్ గా పనిచేసే అమూల్ కుమార్ (వైవా హర్ష)కు సన్నీ లియోన్ అంటే వ్యామోహం ఎక్కువ. ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి ఒక్క రాత్రి అయినా ఆమెతో గడపాలనేది అతని కోరిక. మరోపక్క ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే ఆత్రేయి(అనసూయ)కి తన కొలీగ్ లైఫ్ స్టైల్ చూసి జెలస్ ఫీలవుతూ ఉంటుంది. ఆమెలా అందంగా ఉండాలని ఆత్రేయి కోరిక. అందుకోసం ఎలాంటి ఘోరం చేయడానికైనా రెడీ అని ఫీలవుతూ ఉంటుంది. మరోపక్క గుంజన్ (శుభలేఖ సుధాకర్) కి తన వారసత్వంగా రావాల్సిన ఆస్తి దక్కలేదని కృంగిపోతూ ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని పరితపిస్తూ ఉంటాడు.
ఇక సీఐ గా పనిచేసే చైతన్యకి ఓ నిధి గురించి వివరాలు లభిస్తాయి. దాన్ని ఏం చేసైనా దక్కించుకోవాలి అనేది అతని కోరిక. మరోపక్క చనిపోయిన భర్తను మళ్ళీ బ్రతికించుకోవాలనే మోహంతో ఉంటుంది లక్ష్మి (సురభి ప్రభావతి). ఇక చివరిగా వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్ కి (సాయి కుమార్) గర్వం ఎక్కువ. అలాగే తన వారసులు కూడా తనలానే ఐశ్వర్యం అనుభవించాలని పరితపిస్తుంటాడు. వీళ్ళలో ఉన్న కృత్రిమ కోరికలను తీరుస్తానంటూ ‘ఇక్కడ మీ కోరికలు తీర్చబడును’ అనే థీమ్ తో రంగంలోకి దిగుతాడు ఓ అజ్ఞాత వ్యక్తి(వినోద్ వర్మ). అతనికి సంబంధించిన ఆ యాడ్ ఇన్‌స్టాగ్రామ్, పేపర్స్, ఫోర్బ్స్ వంటి వాటి ద్వారా వైరల్ అయ్యి చివరికి ఆ ఆరుగురిని ఆకర్షిస్తుంది.
ఫైనల్ గా అతని వద్దకు వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో ఆ 6 మందికి ఆ అజ్ఞాత వ్యక్తి రకరకాల టాస్కులు ఇస్తాడు. అవి చాలా కఠినంగా ఉంటాయి. ఉదాహరణకి ఆత్రేయి కోరిక తీరాలంటే..ఆమె కొలీగ్ పై యాసిడ్ పోసి ఆమె అందం పోగొట్టాలని చెబుతాడు. మరోపక్క లక్ష్మీకి తన భర్తని పొందాలంటే.. ఓ పబ్లిక్ ప్లేస్ లో బాంబ్ పెట్టి అక్కడి జనాలను చంపాలని చెబుతాడు. మరి అతను చెప్పినట్టు ఆ 6 మంది చేశారా? చివరికి వారి కోరికల్ని తీర్చుకున్నారా?అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా అని చెప్పాలి.
నిజజీవితంలో మనం మన పనులతోనూ, అవసరాలతోనూ, ఆర్ధిక ఇబ్బందులతోనూ యుద్ధం చేస్తాం..! అని అంతా అనుకుంటారు. కానీ మనలో 6 రకాల మానసిక సంఘర్షణలు ఉంటాయి. వాటినే అరి షడ్వర్గాలు అంటరాని .. ఓ మంచి లైన్ ని రాసుకున్నాడు దర్శకుడు జయశంకర్. ఎలాంటి ప్రేక్షకుడైనా సరే ఈ లైన్ తో ఇంప్రెస్ అయిపోతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ దీనికి తగ్గ కథనం సినిమాలో ఉందా? ఆడియన్స్ ని కథలకుండా కూర్చోబెట్టిందా అంటే.. కచ్చితంగా లేదు అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్లో పాత్రల పరిచయం.. వాళ్ళ ఆలోచనా విధానం.. వాటిని దర్శకుడు పరిచయం చేసిన తీరు బాగుంది. తర్వాత నెరేషన్ అంతా ఫ్లాట్ గా మారిపోయింది.
సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు ఆ 6 మందిలో ఎటువంటి మార్పు రాదు. కానీ ఇంకో 30 నిమిషాల్లో సినిమా అయిపోతుంది అన్నప్పుడు.. 5 నిమిషాలకు ఒకళ్ళ చొప్పున పరమాత్ములు అయిపోతారు. అయితే వాటిలో వైవా హర్ష, సాయి కుమార్ పాత్రల్లో వచ్చిన మార్పులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. మిగిలిన పాత్రల్లో వచ్చిన మార్పులు ఆర్టిఫీషియల్ గానే ఉంటాయి. ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ ని కూడా దర్శకుడు ముందుగానే ఊహించాడేమో.. శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర పాత్రలతో ‘ఏంటి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మనుషులు మారిపోతారా?’ అంటూ ఓ సెటైర్ వేయించాడు.
నటీనటుల విషయానికి వస్తే.. అనసూయ పాత్ర కన్వెన్సింగ్ గా ఉంది కానీ హడావిడిగా ఎండ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్ పాత్రల విషయంలో కూడా అంతే. ఇక సాయి కుమార్ పాత్రకి ఇచ్చిన మెసేజ్ బాగుంది. సాయి కుమార్ కూడా తన పాత్రకి న్యాయం చేశారు. కానీ లుక్స్ మాత్రం తేడా కొట్టాయి. బహుశా కంటిన్యుటీ ఇష్యూస్ అనుకోవాలేమో. వైవా హర్ష పాత్ర బాగుంది.. దానికి పెట్టిన బ్యాక్ స్టోరీ కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ తన బెస్ట్ ఇచ్చాడు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా ఇంప్రెస్ చేయవు.
స్టోరీ లైన్
క్యాస్టింగ్
క్లైమాక్స్ లో వచ్చే ఒకట్రెండు బ్యాక్ స్టోరీస్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
అనవసరమైన దేవుడి ఎలిమెంట్
మొత్తంగా ‘అరి’ స్టోరీ లైన్ పరంగా ఫుల్ మర్క్స్ వేయించుకున్నా.. ఆసక్తికర స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఓ వృధా ప్రయత్నంగా మిగిలిపోతుంది. నేరుగా ఓటీటీలో కనుక రిలీజ్ చేసి ఉండుంటే.. దీనికి దక్కాల్సిన గౌరవం కొంతైనా దక్కేది.