Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం సారప్పక గ్రామంలో రెండు టీఎస్ఆర్‌టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకున్నాయి. రోడ్డులో ఎక్కువగా మలుపులు ఉండటంతో పాటు ఓవర్ స్పీడ్ కారణంగాఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఇతర ప్రయాణికులు సహాయ చర్యలు చేపట్టారు. 108 ఆంబులెన్స్ సహాయంతో భద్రాద్రి ఏరియాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కండెక్టర్, డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.