Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం-వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులు తగ్గితే, నాలుగో రోజు ఆ లోహాల ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు మదుపరులను వెంటాడుతోంది. ఫలితంగా బంగారం-వెండి వైపు చూడడం మానేశారు. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
దేశంలో బంగారం-వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఒక్కోరోజు ఒక్కో విధంగా ధరలు ఉంటున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు, డాలర్ బలపడటం, బాండ్స్‌పై రాబడులు పెరగడం వంటివి ధరల కారణంగా బంగారం వెపు చూడడం మానేశారు పెట్టుబడిదారుల. ఒకప్పుడు సేఫ్ ఇన్వెస్టుమెంట్‌గా బంగారాన్ని భావించేవారు. ఇప్పుడు ఆయిల్, డాలర్ వైపు డైవర్ట్ అయ్యారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్‌లో వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి పుత్తడి 10 గ్రాములు ధర రూ. 250 పెరిగి రూ,1,49,230 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.1,36,790 వద్ద ట్రేడింగ్ జరగుతోంది. మరోవైపు వెండి కిలోకు ధర రూ.2, 21,900 వద్ద కొనసాగుతోంది.
మెట్రో నగరాల ధరలను పరిశీలిద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. రూ,1,49,400 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.1,36,940 వద్ద ఉంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా నగరాల్లో రూ. 200 అటు ఇటుగా ఉంది. చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వెండి ధర కాస్త పెరిగి రూ. 2, 21,900 లకు అటు ఇటు కొనసాగుతోంది. విలువైన లోహాల ధరలు ఒక్కో దగ్గర పన్నుల బట్టి రేటు మారుతూ ఉంటుంది.
బంగారం-వెండి ధరలు ఈ మధ్యకాలంలో నిరంతరం హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. 2026 ఏడాది మొదలైన నుంచి ఇప్పటివరకు బంగారం ధర రూ.14,939 మేరా పెరిగింది. అదే సమయంలో వెండి ధర రూ. 9,591 మేరా దిగొచ్చింది. 2025 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలు ఉండేది. ప్రస్తుతం అది రూ.1.48 లక్షలకు చేరుకుంది. 2025 డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ. 2.21 లక్షలకు పడిపోయింది.
ALSO READ: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!