Illu Illalu Pillalu Serial Today Episode: ధీరజ్ గుండెలపై వాలిపోయి మాట్లాడుతుంది ప్రేమ. ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు.. మళ్లీ ఈ పుట్టింటికి వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తున్నావేమో అంటూ ధీరజ్ అంటే ఇక ఎక్కడికి వెళ్లనని నిన్ను దెయ్యంలా పట్టుకుని వేలాడతాను అంటుంది. ధీరజ్ పాదాలపై తన కాళ్లు పెట్టి అటూ ఇటూ నడుస్తుంది. మరోవైపు శ్రీవల్లి గురించి నర్మద ఆలోచిస్తుంది. శ్రీవల్లి బండారం బయట పెట్టే టైం వచ్చిందని మనసులో అనుకుంటుంది. అప్పుడే వేదవతి భోజనానికి రావాలని అందరిని పిలుస్తుంది. వేదవతి పిలవడంతో అందరూ హాల్లోకి వెళ్తారు. కానీ చందు, ధీరజ్, తిరుపతి మాత్రం తర్వాత తింటామని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడే రామరాజు అటూ ఇటూ చూసి నీ గవర్నమెంట్ కోడలు ఎక్కడని అడగ్గానే.. శ్రీవల్లి ఉలిక్కిపడుతుంది. అప్పుడే నర్మద వస్తుంది. నర్మదను చూసిన శ్రీవల్లి భయంతో వణికిపోతుంది. తన పాలిట యముడిలా వస్తుందని మనసులో అనుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లిన నర్మద, శ్రీవల్లి బండారం ఇప్పుడే బయటపెట్టాలని అనుకుని రామరాజుతో ఓ విషయం చెప్పాలని అంటుంది. తినే దగ్గర ఎలాంటి మాటలు వద్దని వేదవతి ఆర్డర్ వేస్తుంది. దీంతో నర్మద సైలెంట్‌గా ఉండిపోతుంది. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. అయితే అందరం కలిసి భోజనం చేసేది ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని అమూల్య అడుగుతుంది. అందరూ కలిసి సెల్పీ తీసుకుంటారు. ఈ ఆనందానికి కారణం నర్మద అంటూ రామరాజు అప్రిసియేట్ చేస్తాడు.
రామరాజుకు నిజం ఎలా చెప్పాలని నర్మద ఆలోచిస్తుంది. నిజం చెప్పి ఇంట్లో వాళ్లను బాధపెట్టాలా..? నిజం ఎలా బయటపెట్టాలి అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి తాను చేసిన తప్పుకు క్షమించమని అడుగుతుంది. తనకు ఏడుపు వస్తుందని నాటకం ఆడుతుంది. అయితే నర్మద మాత్రం కోపంగా నీ నాటకాలు నా దగ్గర కాదు అంటూ తిడుతుంది. అయితే నిజం మాత్రం రామరాజుకు చెప్పొద్దని బతిమాలుతుంది శ్రీవల్లి. కావాలంటే ధీరజ్, ప్రేమల కాళ్లు పట్టుకుని బతిమిలాడతాను. నువ్వు ఈ కుటుంబం ముక్కలు కాకుండా చూడు. మావయ్య గురించి, చందు బావ గురించి ఒక్కసారి ఆలోచించు అంటూ శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. శ్రీవల్లి రిక్వెస్ట్ చేయడంతో నర్మద ఆలోచనలో పడిపోతుంది. శ్రీవల్లి మాత్రం మనసులో నవ్వుకుంటుంది. నా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా ఉందనుకుంటుంది.
ఇక ముగ్గరు అన్నదమ్ములు కలిసి మందు తాగుతుంటారు. వారికి తిరుపతి కూడా కంపెనీ ఇస్తుంటాడు. మందు తాగుతుంటే ఒక్కోక్కరు నిజాలు మాట్లాడుతుంటారు. అప్పుడే ధీరజ్, ప్రేమల గురించి తిరుపతి మాట్లాడతాడు. వాళ్లిద్దరు కలవడానికి కారణం తానేనని చెప్తాడు. అందుకు సుకన్యతో తన పెళ్లి జరగడమే కారణంగా చెప్తాడు. అయితే అదే నిజమని ఒప్పుకోకపోతే నువ్వు ఏడుస్తావు కదా అంటాడు ధీరజ్. అలాగే ఇద్దరు తమ శోభనాల గురించి మాట్లాడతారు. నీ శోభనం జరగలేదట కదా అని తిరుపతి, ధీరజ్‌ను అడిగితే నీ శోభనం కూడా జరగలేదట కదా అని ధీరజ్ అడుగుతాడు. అవునని తను అసలు ముట్టుకోనివ్వడం లేదని బాధపడతాడు తిరుపతి. అయితే నీకు జీవితకాలం మొత్తం శోభనం జరగదని సాగర్ వెటకారంగా మాట్లాడతాడు. అందరూ తాగిన మత్తులో శోభనం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇవాళ్టీ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏపిసోడ్ అయిపోతుంది.