E-Paper
Advertisement

జరిగిందే చెప్పాను.. ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు..  వైజాగ్ ఘటన పై నటి ఆవేదన!

జరిగిందే చెప్పాను.. ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు..  వైజాగ్ ఘటన పై నటి ఆవేదన!
Advertisement

Chandini Chowdary: చాందిని చౌదరి పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె వైజాగ్ కు చెందిన అమ్మాయి. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్న చాందిని చౌదరి(Chandini Chowdary) ఇటీవల సేవ్ వైజాగ్(Save Vizag) అంటూ ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పేరుతో వైజాగ్ లో కొండలను తవ్వుతూ, పచ్చదనాన్ని నాశనం చేస్తున్న నేపథ్యంలో ఈమె సేవ్ వైజాగ్ అంటూ కొండలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా రాజకీయాల పరంగా చర్చలకు కారణం అయ్యాయి.

కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని..

ఈ నేపథ్యంలోనే చాందిని చౌదరి చేసిన ఈ పోస్టుపై సోషల్ మీడియా వేదికగా రాజకీయపరమైన విమర్శలు వస్తున్నాయి. ఈమె హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారని కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఈమె ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి పోస్ట్ చేశారంటూ కొంతమంది ఈమెకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఈమె తన సొంత ఊరి గురించి ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ వ్యాఖ్యలకు రాజకీయ రంగు పూసి తనపై విమర్శలు చేయడం పట్ల చాందిని చౌదరి స్పందించారు.

అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంది..

Advertisement

ఈ సందర్భంగా చాందిని చౌదరి ఒక వీడియోని విడుదల చేస్తూ తనపట్ల వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ఉంటుందని తెలిపారు. మనం మాట్లాడే విషయం మనకు బాధ కలిగించేది అయినా మర్యాదపూర్వకంగా, గౌరవంగా, మన ఆలోచనలను, బాగోద్వేగాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఉంది. తాను ఒక సామాన్య పౌరురాలిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాను.

?exln=cHE2OHM4cTQyMXQz

Advertisement

ఇలాంటి ఘటనలు గతంలో జరిగినా, ప్రస్తుతం జరుగుతున్న , ఇలాంటి విషయాల పట్ల స్పందించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఒకరి అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ అనుబంధాలు అంటగడుతూ ఇలా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని ఈమె తెలిపారు. తాను కొత్త విషయాలు ఏమీ చెప్పలేదని అక్కడ జరిగింది చెప్పానని అందుకే ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ చాందిని చౌదరి ఈ సందర్భంగా తన పట్ల వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. చాందిని చేసిన ఈ వీడియో పై కొందరు విమర్శలు చేస్తుండగా మరికొందరు మాత్రం ఈమెకు మద్దతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు గ్రూపులలో వైరల్ చేస్తున్నారు.

Also Read: మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

Related News

చెల్లి పెళ్లిలో సందడి చేస్తున్న హీరోయిన్ నజ్రియా!

ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!

‘రామాయణ’ చూసి ఫిదా అయిన అమల అక్కినేని.. ఏమన్నారంటే?

ఆసక్తి రేపుతున్న ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ రిలీజ్!

శ్రీహరి ఇంట్లో శుభకార్యం.. పెళ్లి పీటలెక్కబోతున్న పెద్ద కొడుకు?

నిన్న అమిత్ షా.. నేడు కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రులతో చిరంజీవి భేటీ వెనుక కారణం?

మెగా ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే న్యూస్.. ‘కాకా’ లేటెస్ట్ అప్డేట్..!

Big Stories

Advertisement
×