From April 1st Changes: ఇప్పటివరకు మీ వాట్సాప్, టెలిగ్రాం, ఇన్ స్టాగ్రామ్ మెసేజ్‌లు మీరు తప్ప, ఇంకెవ్వరూ చూడరని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీకు షాకింగ్ అని చెప్పవచ్చు. అందుకంటే ఏప్రిల్ 1, 2025 నుంచి భారత ప్రభుత్వం WhatsApp, Telegram మెసేజ్‌లు, ఇమెయిల్స్ అన్నీ చదవనుంది. అవును ఇది నిజమే. కానీ అందరి మెసేజ్‌లు మాత్రం చెక్ చేయరు. కొంత మందివి మాత్రం తప్పకుండా చేస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. అది ఎవరు, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెసేజ్‌లు, ఇమెయిల్స్
భారత ప్రభుత్వ కొత్త చట్టం ద్వారా, ఏప్రిల్ 1, 2025 నుంచి మీ WhatsApp, Telegram మెసేజ్‌లు, ఇమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్‌కు అధికారులు యాక్సెస్ పొందనున్నారు. కొత్త ఆదాయపు పన్ను (Income Tax) బిల్లును మార్చి 27న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరిస్తూ, దీని ఉద్దేశం ఏంటో స్పష్టం చేశారు.
ఈ కొత్త బిల్లు ఎందుకు తీసుకువచ్చారు?
1961 ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా 2025 ఆదాయపు పన్ను బిల్లు కొత్తగా రూపొందించబడింది. దీని ముఖ్య ఉద్దేశాలు:
-అవకతవకలు, అక్రమ లావాదేవీలను అరికట్టడం
-పన్ను ఎగవేత నిరోధించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించడం
-పాత, ఉపయోగం లేని నిబంధనలను తొలగించడం
-డిజిటల్ ఆస్తులను (cryptocurrency, NFTs) గుర్తించి పన్ను విధించడం
WhatsApp, Telegram మెసేజ్‌ల పరిస్థితి ఏంటి
సీతారామన్ పేర్కొన్న విధంగా ఇటీవల క్రిప్టో కరెన్సీ అక్రమ లావాదేవీల కోసం WhatsApp మెసేజ్‌లను ఉపయోగించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో దాదాపు రూ.250 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. Instagram ఖాతాలను విశ్లేషించడం ద్వారా వారి ‘బినామీ’ ఆస్తులను కనుగొన్నారు. Google Maps ద్వారా, బ్లాక్ మనీ దాచిన ప్రదేశాలను కూడా ట్రాక్ చేయగలిగారు. అందుకోసమే ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచి, చెక్ చేస్తారు.
ప్రభుత్వానికి ఏయే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై అధికారం ఉంటుంది?
-ఈ కొత్త చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ WhatsApp, Telegram మెసేజ్‌లను తనిఖీ చేయగలదు
-ఇమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగలదు
-వెబ్‌సైట్లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో లావాదేవీలు గమనించగలదు
-క్రిప్టో వాలెట్, డిజిటల్ ఆస్తుల సమాచారాన్ని పొందగలదు
-ఏదైనా డిజిటల్ భద్రతా కోడ్స్‌ను (Access Codes) బైపాస్ చేసి డేటాను పొందగలదు
ప్రభుత్వం ఏవిధంగా డేటా వాడుకుంటుంది?
ఈ డేటా ప్రధానంగా పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక లావాదేవీలను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి అక్రమ లావాదేవీలు బయటపడితే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నిబంధనల ఉద్దేశం క్రిప్టోకరెన్సీ, అక్రమ ఆర్థిక లావాదేవీల పన్ను ఎగవేతను అడ్డుకోవడం అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
మీ వ్యక్తిగత గోప్యతపై ప్రభావం ఉంటుందా?
ప్రభుత్వం ఈ చర్యలను దేశ ఆర్థిక వ్యవస్థను చట్టపరమైన చర్యల కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. అయితే, ఇది వ్యక్తిగత గోప్యత హక్కుల (Right to Privacy) ఉల్లంఘన అవుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్..
ఏప్రిల్ 1, 2025 నుంచి
ఏప్రిల్ 1, 2025 నుంచి భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పలు ఆర్థిక నియమాలు మారనున్నాయి.
1. ఆదాయపు పన్ను (Income Tax) మార్పులు
రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 కలిపి మొత్తం రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. రిబేట్ పరిమితి రూ.25,000 నుంచి రూ.60,000కి పెరిగింది.
2. టీడీఎస్ (TDS) & టీసీఎస్ (TCS) మార్పులు
-సీనియర్ సిటిజన్ల టీడీఎస్ మినహాయింపు రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెరిగింది.
-అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెరిగింది.
-మ్యూచువల్ ఫండ్ & డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితి రూ.5,000 నుంచి రూ.10,000కి పెరిగింది.
-రూ.7 లక్షలకు మించిన విదేశీ విద్య రుణాలపై 5% టీసీఎస్ అమలు చేయబడుతుంది.
3. యూపీఐ (UPI) మార్పులు
-పాత లేదా ఇతరులకు అప్పగించిన మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు నిలిపివేయబడతాయి.
-యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఉన్న డబ్బును బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
4. బ్యాంకింగ్ మార్పులు
SBI, PNB వంటి బ్యాంకులు కనీస బ్యాలెన్స్ నియమాలను మారుస్తున్నాయి. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకునే ఛార్జీలలో మార్పులు ఉండొచ్చు.
5. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు
SBI, యాక్సిస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల పాలసీలో మార్పులు చేయబోతున్నాయి.
6. రూపే (RuPay) డెబిట్ కార్డ్ మార్పులు
రూపే డెబిట్ సెలెక్ట్ కార్డుతో ప్రయాణ, హెల్త్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి.