Jabardast Comedian:జబర్దస్త్.. గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఏకైక కామెడీ షో ఇది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు ఈ వేదిక ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకొని.. ఇప్పుడు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ షోలో ఒకప్పుడు కమెడియన్స్ గా పని చేసిన ఎంతోమంది నేడు వెండితెరపై హీరోలుగా, దర్శకులుగా, కమెడియన్లుగా చలామణి అవుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ షో ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుని, అటు సినిమాలలో కమెడియన్ గా చేసి హీరోగా కూడా ఆకట్టుకొని ఇప్పుడు నిర్మాతగా మారిన ఒక కమెడియన్ పై విడాకుల రూమర్లు జోరుగా ఊబందుకున్నాయి.. అయితే ఆ రూమర్స్ కి ఒక్కసారిగా చెక్ పెట్టారు ఆయన సతీమణి. మరి వారెవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
విడాకుల రూమర్లపై స్పందించిన ధనరాజ్ తల్లి..
టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన ఆయన ప్రయాణంలో ఆయన భార్య శిరీష ఆయన వెన్నంటే నిలిచింది. తాజాగా తొలిసారి ఒక ఇంటర్వ్యూకి హాజరైన ఈమె.. ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే విడాకులు అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడుతూ.. “మా వివాహం జరిగిన తర్వాత ‘జగడం’ సినిమా విడుదలయ్యింది. ఇక సినిమాతోనే ఆయన అదృష్టం కూడా మారిపోయింది. వచ్చిన ఫేమ్ తో నిర్మాతగా మారాలని ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా చేశాడు. అయితే నేను వద్దన్నాను. వినకుండా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక నేను అనుకున్నట్టుగానే మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో పుకార్లు సృష్టించారు. మేము రోడ్డున పడ్డామని, ఇల్లు కూడా అమ్మేసుకున్నామని, ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారమని ఎన్నో కథనాలు అల్లేసారు. నిజానికి మా మధ్య అందరి భార్య భర్తల లాగే గొడవలు వస్తాయి. ఒక్కోసారి పది రోజులు కూడా మాట్లాడుకోము. అంతమాత్రాన విడాకులు తీసుకొని వేరుపడతామా” అంటూ విడాకుల రూమర్స్ పై మాట్లాడి చెక్ పెట్టింది శిరీష.
ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి..
ధనరాజుది విజయవాడ.. మాది ఖమ్మం.. నేను క్లాసికల్ డాన్సర్ ను. ఫిలింనగర్ లో ఒక డాన్స్ స్టూడియోను ధనరాజు పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతుండగా.. అలా నన్ను కలిశాడు. అయితే నన్ను కలిసిన కొన్ని రోజులకే ధనరాజ్ తల్లి క్యాన్సర్ తో చనిపోయింది. ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఆయన తల్లి అంత్యక్రియలు చేయడానికి నేనే.. నా బంగారు నగలు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాము. నవంబర్లో ఆమె చనిపోతే.. మార్చిలోనే పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. ఆ పెళ్లి కూడా నేనే ప్లాన్ చేశాను. రేపు మన పెళ్లి అన్నప్పుడు ఆయన జస్ట్ సరే అని తలూపాడు. దాంతో నేను అతడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లను కూడా కాదని, 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను” అంటూ తమ ప్రేమ, పెళ్లి విషయంపై మాట్లాడారు శిరీష. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
22 Years Of Allu Arjun: ‘గంగోత్రి’ మొదలు ‘పుష్ప2’వరకూ.. విజయాలతో పాటు అవమానాలు కూడా..