Big Stories

Fujiyama EV Classic @ Rs 1,999: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 120 కి.మీ మైలేజీ.. రూ.1999లతో ఇంటికి తెచ్చుకోండి..

FUJIYAMA Classic Electric Scooter
FUJIYAMA Classic Electric Scooter

Buy Fujiyama EV Classic @ Rs 1,999 Only: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ అధిక ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు సైతం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.

- Advertisement -

దీంతో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు విదేశాల్లో కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు భారత మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతున్నాయి.

- Advertisement -

అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరగడంతో ప్రముఖ తయారీ కంపెనీలు రకరకాల మోడళ్లను తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా వీటి ధరలను కూడా అధికంగా ఉంచుతున్నాయి. అందువల్ల చాలామంది వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు.

అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఈవీ స్కూటర్ భారత మార్కెట్‌లో విడుదల అయింది. ఫుజియామా ఈవీ నుంచి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్ ఇండియాలో లాంచ్ అయింది. దీనిని అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందించేలా సిద్ధం చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

Also Read: అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా EV.. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలో మీటర్లు!

ఫుజియామా (Fujiyama EV Classic Electric Scooter) తీసుకొచ్చిన క్లాసిక్ ఈవీలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను కంపెనీ అందించింది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వేగంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది. ఈ ఈవీ కేవలం 4 గంటల్లోనే పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది. ఇందులో ట్విన్-బ్యారెల్ టైప్ LED లైట్ సెటప్‌ను అమర్చారు.

ఈ ట్విన్‌-బారెల్‌ టైప్‌ ఎల్‌ఈడీ సెటప్‌ ద్వారా.. రాత్రిపూట కూడా సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా ఈ క్లాసిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించారు. ఇందులో కాంబి డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది. ఇక ఫీచర్స్ పరంగానే కాకుండా.. లుక్ పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.

ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా గంటకు 60 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్‌ పెడితే ఏకంగా 120 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

కాగా ఈ స్కూటర్‌లో అత్యుత్తమ రేంజ్‌ను అందించడం కోసం 2.05 kWh బ్యాటరీ ప్యాక్‌ని అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికొస్తే..ఫుజియామా క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం లక్ష రూపాయలలోపే కంపెనీ తీసుకొచ్చింది. కేవలం రూ.79,999 ధరతో దీనిని భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది.

Also Read: బంపర్ ఆఫర్.. స్కూటర్‌పై ఏకంగా రూ. 41వేలు డిస్కౌంట్!

ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ.1,999 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డెలివరీలు త్వరలో స్టార్ట్ కానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News