BigTV English

Discount on TVS iQube Electric: బంపర్ ఆఫర్.. స్కూటర్‌పై ఏకంగా రూ. 41వేలు డిస్కౌంట్!

Discount on TVS iQube Electric: బంపర్ ఆఫర్.. స్కూటర్‌పై ఏకంగా రూ. 41వేలు డిస్కౌంట్!
TVS iQube Electric
TVS iQube Electric

Rs 41,000 Discount on TVS iQube Electric: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ఊపందుకుంటుంది. ఈవీ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. కంపెనీలు కూడా కస్లమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మంచి టెంమ్టింగ్ ప్రైజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీలు పోటీపడి మరీ రాయితీలను కల్పిస్తున్నాయి. సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయరీ కంపెనీ టీవీఎస్‌ భారీ ఆఫర్ ప్రకటించింది.తన iQube ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై ఏకంగా రూ. 41 వేల బెనఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కొద్ది రోజుల వరకే ఉంటుందని వెల్లడించింది.


దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లతో పోలిస్తే ఈ స్కూటర్లకు ఫుల్ క్రేజ్ ఉంది. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్‌, లైట్‌ వెయిట్‌, ఈజీ హ్యాండ్లింగ్‌ వల్ల పట్టణాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈవీ వాహనాల తయారీ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌తో స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

అంతేకాకుండా ఈవీల తయారీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న FAME-2 సబ్సిడీ గడువు మార్చి నెలతో ముగియనుంది. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ సంస్థ టీవీఎస్‌.. తన ఐక్యూబ్ పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే ఉండనుంది.


Also Read: తక్కువ ధర.. ఎక్కువ డేటా.. ఐపీఎల్ కోసం బెస్ట్ ప్లాన్లు ఇవే..

ఈ నెలాఖరు లోపు టీవీఎస్‌ ఐక్యూబ్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేసినట్లయితే.. రూ. 41 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. వీటిలో క్యాష్ బ్యాక్ ఆఫర్‌ కింద రూ. 6000 పొందొచ్చు. అలానే నో కాస్ట్ EMIపై కొనుగోలు చేస్తే రూ. 7500 అదనంగా ధర తగ్గుతుంది. అదేవిధంగా ఈ టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ. 5వేల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని ఉచితంగా సంస్థ అందిస్తోంది. అదేవిధంగా FAME 2 సబ్సిడీ కింద ఐక్యూబ్‌పై రూ.22,065 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఆఫర్లన్నంటినీ కలిపితే కొనుగోలు దారుడు ఈ స్కూటర్‌పై రూ. 41 వేలు విలువ గల బెనిఫిట్స్ పొందొచ్చు.

TVS ఐక్యూబ్‌ ఫీచర్లు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫీచర్లు చూసినట్లయితే.. క్లీన్ యూఐ కలిగిన 7 ఇంచెస్ TFT టచ్ స్క్రీన్‌ ఉంటుంది. ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్ సపోర్ట్, ఎంజాయ్ చేయడానికి మ్యూజికల్ ప్లేయర్, అలెక్సా స్కిల్ సెట్ పొందుపరిచారు. అంతేకాకుండా OTA అప్‌డేట్స్‌, ప్లగ్-అండ్-ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఇందులో ఉన్నాయి.

Also Read: ఆ కారుపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 80,000 తగ్గింపు

ఈ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.4kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఫుల్ ఛార్జ్ చేసి 100 కి.మీ వరకు వెళ్లోచ్చు. స్టోరేజ్‌ స్పేస్‌ 32 లీటర్లు ఉంటుంది. ఇప్పటికే ఈ స్కూటర్‌‌ను దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది వినియోగిస్తున్నారు. మీరు ఫ్యామీలో కోసం ఎలక్ట్రిక్ స్కూటీ చూస్తుంటే ఇది బెస్ట్ ఆఫ్షన్.

Tags

Related News

Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Big Stories

×