E-Paper
Advertisement

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?
Advertisement

Gold Price Today: ఎట్టకేలకు బంగారం ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు లాభాలను స్వీకరణకు దిగారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులపాటు ఇదే కంటిన్యూ కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి ధరలు

ఎట్టకేలకు పసిడి ప్రియులకు ఊహించని శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ఉక్రెయిన్- రష్యా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండడం వంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా డాలర్ విలువ పుంజుకోవడం, అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉండడంతో బంగారం మదుపరులు లాభాల స్వీకరణ దిగారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధర పతనమైంది. ఈ ధర మరింత తగ్గే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ మార్కెట్ లోని ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

Advertisement

 

అంతర్జాతీయమార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి?

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 74 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4332 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.39 శాతం మేరా తగ్గి, ఔన్స్ వెండి రేటు 64 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

Advertisement

 

దేశీయ మార్కెట్లో ధరలు ఇప్పుడు చూద్దాం

గడిచిన మూడురోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రస్తుతం వాటి ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్-విజయవాడ బులియన్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1260 మేర తగ్గింది. తులం రేటు రూ.1,53,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1150 మేర తగ్గి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,800 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర దిగి వచ్చినా, వెండి కనికరించలేదు. ఆగస్టు 11న కిలో వెండి రేటు రూ.10 వేలు పెరిగింది. ఆ తర్వాత అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్-విజయవాడ మార్కెట్లలో రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

ALSO READ: ఓలా-ఉబర్‌కు షాక్.. క్యాబ్ బుకింగ్ కోసం టిప్ చెల్లించాల్సిన అవసరం లేదు

మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలో బంగారం ఒక గ్రాము ధర రూ. 15,374 (24K), రూ. 14,094 (22K)గా ఉంది. ముంబైలో ఒక గ్రాము ధర రూ. 15,359 (24K), రూ. 14,079 (22K) ఉంది. చెన్నైలో బంగారం గ్రాము ధర రూ. 15,514 (24K), రూ. 14,221 (22K)గా కొనసాగుతోంది. కోల్‌కతాలో బంగారం గ్రాము ధర రూ. 15,359 (24K), రూ. 14,079 (22K)గా ఉన్నాయి.

Related News

భారీగా పడిపోతున్న పసిడి ధర.. మార్కెట్లో ధరల మాటేంటి? ఈనెలలో ఎంత తగ్గింది?

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

Big Stories

Advertisement
×