E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రి కోసం తాయారు టెన్షన్.. చక్రికీ మహా షాక్.. హైలెట్ సీన్ ఇదే..

Podarillu Today Episode : గాయత్రి కోసం తాయారు టెన్షన్.. చక్రికీ మహా షాక్.. హైలెట్ సీన్ ఇదే..
Advertisement

Podarillu Today Episode august 14th: తాయారుకు లోపల వంట చేస్తూ ఉండగా చక్రి తనని కూడా బయటకు తీసుకొని వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాడు.. లోపలికి వెళ్లి ఏదో ఒకటి చేసి అతని బయటికి తీసుకుని వస్తాను ఆమె కూడా మనలాగే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి అని చక్రి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇక తాయారు అక్కడ గ్యాస్ వెలగడం లేదు వంట సగంలోనే ఉంది ఎలాగైనా సరే బయటికి వెళ్లాలి అని అనుకుంటుంది.. ఇక అక్కడికి వెళ్లి వంటతో కష్టపడుతూ ఉంటుంది తాయారు.. గాయత్రి ఏం వంట చేస్తున్నావ్ అమ్మ అని అడుగుతుంది.. పప్పు చేస్తున్నానంటే ఏంటి మా ఆయన నువ్వు పప్పు పెడతావా అని అడుగుతుంది.. కానీ మాధవలు వెజ్ బిర్యానీ చేస్తుండడం చూసి.. మేము బిర్యానీ చేస్తున్నామని అనగానే గాయత్రి ఆమె భర్త అటు వెళ్లిపోతారు.

తాయారుకు దిమ్మతిరిగే షాక్..

మాధవ్ వాళ్లందరూ ఆరుబయట కూర్చుని తినడంతో సతీష్ వాళ్ళు అక్కడికి వస్తారు.. సతీష్ అక్కడ అంతా చూసి ఎంత బాగుంది మీరు ఇలా తింటూ ఉంటే అని అడుగుతాడు. ఒక చిన్న డౌటు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు చక్రి ఎందుకు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు అని మాధవ్ ని అడుగుతారు. దానికి మాధవ్.. మౌనంగా ఉంటే నారాయణ సమాధానం చెబుతాడు.. అసలు మా వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే వాళ్ల వాళ్ళు మా వాడి కాళ్లు పట్టుకొని వేడుకున్నారో దానితో ఆ అమ్మాయికి వేరే సంబంధం ఒక ఖాయంతో పెళ్లి చేసుకున్నారు అని నిజం చెప్తాడు.. తాయరు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.

నారాయణ మాటతో తాయారుకు కంగారు..

Advertisement

నారాయణ మా వాడికి ఇప్పటికే ఎప్పుడో పెళ్లి అవ్వాల్సింది. కాకపోతే ప్రేమించిన అమ్మాయి తనకోసం వచ్చేసిన సరే.. వాళ్ళింట్లో వాళ్లకోసం ఆగి తనని త్యాగం చేశాడు అని చెప్తాడు. వాడు ఆరోజు కావాలి అని అనుకుంటే ఇవాళ వేరేలా ఉండేది అని నారాయణ చెప్పగానే తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది.. ఈ దొంగ సచ్చిన నారాయణ నిజం చెప్తాడా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. కానీ గాయత్రి వాళ్ళ ఆయన వినోద్ మాత్రం అన్నయ్యని మోసం చేసింది ఎవరు అని అడుగుతాడు. ఆ మాట వినగానే నారాయణ నిజం చెప్పబోతాడు కానీ మాధవ్ మాత్రం ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి భర్తతో కాపురం చేసుకుంటుంది ఇప్పుడు తన గురించి మనకెందుకు అని అంటాడు.. ఆ మాట వినగానే తాయారు మాలో చాలా మంచివాడు కాబట్టి మంచి అమ్మాయి భార్యగా వస్తుంది అని అంటుంది.

శైలుకు సీక్రెట్ గా పెళ్లి..

శైలు ఉదయం లేవగానే వరాలు ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడుగుతుంది.. ఏం దిక్కుమాలిన ప్రశ్న కాలేజీ కి వెళ్తున్నాను.. రోజు వెళ్లేదే కదా మరి కొత్తగా అడుగుతున్నావ్ ఏంటి అని శైలు వరాలుని అడుగుతుంది. ఇవాళ నువ్వు ఏమీ కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు నాకు పనిలో సహాయంగా ఉండాలి అని అంటుంది వరాలు. నీకు సాయం చేస్తానని ఎలా అనుకుంటున్నావు నేను చచ్చినా నీకు సాయం చేయను అని శైలు అంటుంది. ఇక అప్పుడే సురేష్ వాళ్ళ ఫ్రెండ్ రాగానే అన్నయ్య అంటూ శైలు అనడంతో అతను బాధ పడిపోతూ ఉంటాడు. శైలు కి తన ఫ్రెండు బాగా సెట్ అవుతాడు అని సురేష్ పెళ్లి సంబంధం కుదురుస్తాడు. ఒక్కరోజులోనే పెళ్లయితే బాగుంటుంది అని వరాలతో పాటు సురేష్ కూడా అభిప్రాయపడతాడు.. వీళ్ళిద్దరూ కలిసి తనకి పెళ్లి చేయాలని అనుకుంటారు.

చక్రీకి దిమ్మతిరిగే షాక్..

Advertisement

మీ వాళ్ళందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్లి పడుకోవాలని అనుకుంటారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని చక్రి వెనకాలే వచ్చి అడుగుతాడు.. ఈ టైంలో అదేం ప్రశ్న పడుకోడానికి వెళ్తున్నాము అని అనగానే గదిలో పడుకుంటే అసలే దెయ్యాలు ఉన్నాయంట. వీటిపక్క చుట్టు పొదలే ఉన్నాయి. కాబట్టి పాములు కూడా వచ్చే అవకాశం ఉంది నేను అక్కడ ఒకచోట పడుకుంటాను. మీ గదిలోనే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని అంటాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం నాకేం భయం లేదు టార్చ్ ఉంది నా దగ్గర అని ఎంతగా చక్రి బ్రతిమలాడిన కూడా ఒప్పుకోదు. ఆ తర్వాత కేశవ మనిషా ని మహాలక్ష్మి గదిలో పడుకోమని చెప్పాడు అని చెప్పగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు..

మహా పై తాయారుకు అనుమానం..

మహాలక్ష్మి గదిలోకి వెళ్ళగానే తాయారు వెనకాలే గదిలోకి వస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. గ్యాస్ స్టవ్ తీసుకున్నట్లుగానే ఈ గదిని కూడా మీరు తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది మహా.. నీకు చక్రికి పెళ్లయింది కదా.. మరి మీరిద్దరూ ఒకే గదిలో పడుకోకుండా ఇలా విడివిడిగా పడుకుంటున్నారు ఏంటి అని తాయారు అనుమానంగా అడుగుతుంది. ఆ ఇద్దరికీ పెళ్లయింది గొడవ కూడా అయింది అందుకే నేను తన దగ్గర పడుకోను అని మహాలక్ష్మి ఏదో ఒకటి చెప్పి తాయారుని అక్కడి నుంచి పంపిస్తుంది.. ఇక ఉదయం లేవగానే అందరూ గుడి కోసం రెడీ అయ్యి బయటకు వస్తారు.. కన్నా మాధవని ఆడుకుంటాడు అలాగే చక్రి రెడీ అవ్వడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నావ్ రా అని అంటారు.. మహాలక్ష్మి చీరలో రావడం చూసి చక్రీతో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తావా..? బొక్కలు బయటపెడతాను..

Related News

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Big Stories

Advertisement
×