Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా బంగారం-వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా డాలర్ బలంగా ఉండడం, క్రూడాయిల్ ధరల పెరగడం వంటి పరిణామాలతో పెట్టుబడిదారులు అటు వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వాటి ధరలను ఇప్పుడుచూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర క్రమంగా కుప్పకూలుతోంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 143 డాలర్లు పడిపోయింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం రేటు 4134 డాలర్ల వద్దకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 5.29 శాతం పతనమైంది. ప్రస్తుతం 60.77 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తు్న్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు పతనం అవుతున్నాయి.
ఒక్క సెప్టెంబర్ నెలలో గడిచిన 28 రోజుల్లో బంగారం ధర 8,000 రూపాయలు తగ్గంది. వెండి ధర 14,000 రూపాయలు తగ్గింది. ఆగస్టు 31న 10 గ్రాముల బంగారం ధర 1.56 లక్షల రూపాయలు ఉండగా అది ఇప్పుడు రూ. 1.48 లక్షల రూపాయలకు పడిపోయింది. వెండి ధర కిలో రూ. 2.37 లక్షల రూపాయల నుంచి 2.23 లక్షల రూపాయలకు దిగిపోయింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.2510 మేరా తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ.1,50,170 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.2300 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,37,650 వద్దకు దిగివచ్చింది. ఇక కిలో వెండి రేటు రూ.5000 మేర తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు పడిపోయింది.
మెట్రో నగరాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర రూ. 1,50,310 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,37,790 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,160 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,37,640 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. చెన్నైలో కాస్త ఎక్కువగా అంటే రూ. 200 ఎక్కువగా ఉంది. వెండి ధరలు కిలో 2.23 లక్షలకు పైన ట్రేడింగ్ జరుగుతోంది.
ALSO READ: బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే
బంగారం-వెండి ధరలు పతనం తప్పదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, ఈ రెండింటికి కలిపి ద్రవ్యోల్బణం భయాలు పెట్టుబడుదారులను వెంటాడుతున్నాయని చెబుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ ట్రెజరీ బాండ్స్, డాలర్ వైపు చూస్తుండడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోందని అంటున్నాయి.