E-Paper
Advertisement

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Advertisement

Instagram Wordmark Logo: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ దాదాపు పదేళ్ల తర్వాత తమ ఐకానిక్ Wordmark (టెక్ట్స్) లోగోను మార్చింది. యాప్ తెరవగానే కనిపించే ఈ మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. డిజైన్‌ను మరింత సింపుల్‌గా, ఆధునిక శైలిలో తీర్చిదిద్దామని కంపెనీ చెబుతున్నప్పటికీ.. సాధారణ వినియోగదారులు మాత్రం ఈ కొత్త రూపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొత్త లోగోలో వచ్చిన మార్పులేంటి?

ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌ టెక్ట్స్ లోగో వెనుక కనిపించే ఆకర్షణీయమైన పింక్ రంగును పూర్తిగా తొలగించారు. దానికి బదులుగా ఏమాత్రం హంగులు లేని ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ను ప్రవేశపెట్టారు. చూడటానికి ఇది చాలా సింపుల్‌గా అనిపించినప్పటికీ, ఫాంట్ శైలిలో చేసిన మార్పులే అసలు సమస్యగా మారాయి.

Advertisement

Also Read: ఇంత తక్కువకి OnePlus 13 మళ్లీ దొరకదు.. Flipkart Freedom Saleలో క్రేజీ ప్రైస్ డ్రాప్!

అక్షరాల మధ్య గ్యాప్‌లు:

పాత లోగోలో అక్షరాలు ఒకదానికొకటి చాలా స్మూత్‌గా, కలిసిపోయినట్లు ఉండేవి. కానీ కొత్త వర్డ్‌మార్క్‌లో అక్షరాల కలయిక సరిగ్గా లేకపోవడమే కాకుండా.. వింతగా విరిగిపోయినట్లు అనిపిస్తున్నాయి. ఫాంట్ చాలా బిగుతుగా, నిర్జీవంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ వింతైన గ్యాప్‌ల వల్ల పేరు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

ఏఐ చేసిందంటూ నెటిజన్ల సెటైర్లు:

Advertisement

ఈ కొత్త డిజైన్ చూసి చాలామంది సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరిగ్గా వర్క్ చేయక తయారుచేసిన లోగోలా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. గతంలో కియా వంటి కొన్ని ప్రముఖ కార్ల బ్రాండ్లు చేసిన తప్పుడు డిజైన్ మార్పులతో దీనిని పోలుస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు బాగున్నప్పుడు, లీడింగ్ ఫుడ్ బ్రాండ్లలా క్లాసిక్ లుక్‌ను కాపాడుకోవాలి కానీ, ఇలాంటి ప్రయోగాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

లక్షల డాలర్లు దండగేనా?

ఈ చిన్న మార్పు కోసం మెటా సంస్థ గ్రాఫిక్ డిజైనర్లకు లక్షల డాలర్లు తగలేసిందని యూజర్లు మండిపడుతున్నారు. అంత డబ్బు ఖర్చుపెట్టి లోగోను మెరుగుపరచాల్సింది పోయి, ఉన్న అందాన్ని కూడా పాడుచేశారని విమర్శిస్తున్నారు. పాత లోగో కూడా అంత గొప్పగా ఏం లేదని కొందరు అంటున్నా.. ఈ కొత్త మార్పును మాత్రం మెజారిటీ యూజర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలక్రమేణా ఈ కొత్త లుక్‌కి అలవాటుపడతారో లేదో చూడాలి.

Also Read: రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×