E-Paper
Advertisement

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్, అన్నీ ఉచితంగానే

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్,  అన్నీ ఉచితంగానే
Advertisement

Theater: మధ్యాహ్నం భోజన తర్వాత గంట సేపు రెస్ట్ తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేసినవారికి విపరీతంగా నిద్ర వస్తుంది. ఓ గంట సేపు నిద్రపోతే ఆ తర్వాత ఎప్పటి మాదిరిగా పని చేయవచ్చని భావిస్తుంటారు. అదే సినిమా హాలులో నిద్రపోయే అవకాశం వస్తే అస్సలు వదలరు. అలాంటి పద్దతిని చైనాలో మెల్లగా మొదలైంది. అక్కడ చాలామంది ఉద్యోగులు థియేటర్లలో స్లీపింగ్ సిస్టమ్ ని వినియోగించుకుంటున్నారు.

 

సినిమా థియేటర్లలో కునుకు సేవలు

Advertisement

అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది థియేటర్లకు వెళ్లడం మానేశారు. మహా అయితే ఫ్యామిలీతో వీకెండ్ థియేటర్‌కు వెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల థియేటర్ల వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితి గమనించిన చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లోని లుమియాయ్ సినిమా హాలులో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. గతేడాది ఏప్రిల్ నుండి ఉద్యోగుల కోసం మధ్యాహ్న నిద్ర సేవను అందిస్తోంది. ఈ సేవను ఉద్యోగులు తమ భోజన విరామ సమయంలో రిక్లైనింగ్ సీట్లు ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 గంటల వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఫోన్‌లను సైలెంట్‌గా ఉంచాలి. అధికంగా గురక పెట్టేవారిని ప్రత్యేక హాలుకు పంపిస్తారు. దుప్పట్లు, కాఫీ, ఇతర పానీయాలు ఉచితంగా అందిస్తారు. కంటి మాస్కులు ఒక్కొక్కటి రూ. 80కి లభిస్తాయి.

ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్

భోజనం తర్వాత ఉద్యోగులు తన ఆఫీసు వద్ద కునుకు తీయకుండా, ఇచ్చిన రెండున్నర గంటల సమయం భోజనం, నిద్ర పోవడానికి సినిమా హాల్‌కు వస్తున్నారు. సినిమా హాళ్లలోని రెండు స్క్రీన్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన రిక్లైనర్ సీట్లు ఉన్నాయి. నిద్రపోవడానికి అనుకూలంగా ఉంటాయి. వినియోగదారులకు పడుకోవడానికి ఉచిత దుప్పట్లు, మొబైల్ ఛార్జర్లు, నిద్రలేచిన తర్వాత కాఫీ లేదా ఇతర పానీయాలు ఉచితంగా ఇవ్వనుంది థియేటర్. పురుషులు-మహిళలు నిద్రపోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయం కేవలం సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే. అది మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

 

చైనా థియేటర్లలో కొత్త కాన్సెప్ట్

వారం రోజులు మధ్యాహ్నం వేళ సినిమా హాళ్లు సాధారణంగా ఖాళీగా ఉంటాయి. దానివల్ల థియేటర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి. ‘లంచ్-బ్రేక్ ఎకానమీ’ ద్వారా థియేటర్లు తమ ఖాళీ సీట్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ విధంగా వారపు రోజుల్లో ఆక్యుపెన్సీ రేటు పెంచుకుంటున్నాయి. అందుకోసం నెలవారీ పాస్‌లు 39.9 యువాన్ల నుండి ప్రారంభమవుతాయి. దేశీయ కరెన్సీ చూస్తే రూ. 480 నుంచి 720 రూపాయల వరకు ఉంటుంది. ఖాళీగా ఉన్న థియేటర్లను ఆదాయ వనరుగా మార్చుకుంది.

ALSO READ: మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

చైనా కార్మికులకు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోడం అనేది చాలాకాలంగా ఉన్న సంప్రదాయం. అందుకోసం దాదాపు రెండున్నర గంటల సమయం ఇస్తారు. కాబట్టి ప్రజలు తమ ఆఫీసు డెస్కుల వద్ద అసౌకర్యంగా నిద్రపోవడం కంటే, చీకటిగా నిశ్శబ్దంగా ఉండే సినిమా హాళ్లను ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కాన్సెప్ట్ చైనా అంతా విస్తరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related News

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే

లారీ డ్రైవర్ కుమారుడు.. కాలేజీ చదువులో ఫెయిల్.. కట్ చేస్తే రూ.800 కోట్ల కంపెనీ ఓనర్

లోన్ యాప్‌లో అప్పు తీసుకుంటున్నారా? జాగ్రత్త ఫేక్ యాప్స్‌తో ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!

భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు.. ఏడాదికి రూ.600 కోట్లు సంపాదన.. ఎలాగంటే

Big Stories

Advertisement
×