E-Paper
Advertisement

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా
Advertisement

Banks-Schools Holidays: సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తమకు సెలవులు ఎన్ని వస్తున్నాయని చూస్తుంటారు. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వినాయక చవతి కూడా ఈ మాసంలో రానుండడంతో ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాంకులకు 14 రోజులు, పాఠశాలలకు 8 రోజులు సెలవులు రానున్నాయి.

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు పండగే

దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు సెలవులు ఒకేలా ఉండవు. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ రాష్ట్రాల బట్ట సెలవులు మారుతాయి. బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నవారు ముందుగా తమ ప్రాంతంలోని బ్రాంచ్ సెలవుల షెడ్యూల్‌ను చెక్ చేసుకోవడం బెటర్. ప్రాంతీయ పండుగలతోపాటు ప్రతి నెలా వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు 14 రోజుల పాటు మూతపడనున్నాయి. కేవలం సగం రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. మధ్యలో బ్యాంకులు ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. సెలవుల జాబితాలో జన్మాష్టమి , వినాయక చవితి, జాతీయ సెలవులు, స్థానికంగా పండుగలు, రెండవ శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు అందులో ఉన్నాయి.

Advertisement

సెప్టెంబర్ 04న జన్మాష్టమి సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల బ్యాంకులకు సెలవు. మరొక రోజు గ్యాప్ అంటే
సెప్టెంబర్ 6 ఆదివారం నార్మల్ గా వచ్చే సెలవు.
11న : జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంది.
12న రెండో శనివారం, 13న ఆదివారం వచ్చాయి.
సెప్టెంబర్ 14 : గణేష్ చవితి కారణంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు సెలవు ఉంటుంది.
15న సంవత్సరి సందర్భంగా అహ్మదాబాద్, ఒరిస్సా, గోవాల్లో బ్యాంకులకు సెలవు వచ్చింది.
సెప్టెంబర్ 20న ఆదివారం కాగా, 21న శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం కారణంగా ఒరిస్సా-కేరళలోని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 22న కర్మ పూజ సందర్భంగా రాంచిలోని బ్యాంకులకు సెలవు వచ్చింది.
సెప్టెంబర్ 23న మహారాజా హరిసింగ్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 25న ఇంద్రయాత్ర సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, మరుసటి రోజు ఆదివారం

 

పాఠశాల విద్యార్థుల విషయానికి వద్దాం

Advertisement

సెప్టెంబర్ నెలలో వివిధ పండుగలు, ప్రభుత్వ సెలవులు, వారాంతపు సెలవులు కలిపి పాఠశాల విద్యార్థులకు దాదాపు 8 రోజులు సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 6, 12, 13, 14, 20, 23, 26, 27 తేదీలు సెలవు రోజులు వచ్చాయి. సెలవుల అమలు రాష్ట్రం, పాఠశాల విద్యా క్యాలెండర్‌ను బట్టి మారవచ్చు. తెలంగాణలో అధికారిక క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 14న వినాయక చవితి, సెప్టెంబర్ 23న యజ్దహుమ్ షరీఫ్ వంటి సెలవులున్నాయి.
సెప్టెంబర్ 6న ఆదివారం సెలవు వచ్చింది.
సెప్టెంబర్ 12న శనివారం రెండో శనివారం
సెప్టెంబర్ 13న ఆదివారం కాగా, 14న సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు
సెప్టెంబర్ 20న ఆదివారం సెలవు
సెప్టెంబర్ 23న బుధవారం యజ్దహుమ్ షరీఫ్ సందర్భంగా సెలవు కలిసి వచ్చింది.
సెప్టెంబర్ 26న శనివారం నాలుగో శనివారం సెలవు కొన్ని పాఠశాలకు ఉంటుంది.
సెప్టెంబర్ 27న ఆదివారం మామూలుగా వారాంతపు సెలవు

Related News

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్, అన్నీ ఉచితంగానే

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే

లారీ డ్రైవర్ కుమారుడు.. కాలేజీ చదువులో ఫెయిల్.. కట్ చేస్తే రూ.800 కోట్ల కంపెనీ ఓనర్

లోన్ యాప్‌లో అప్పు తీసుకుంటున్నారా? జాగ్రత్త ఫేక్ యాప్స్‌తో ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!

భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు

Big Stories

Advertisement
×