BigTV English

Today Gold Rate: తగ్గిన బంగారం ధర.. అయినా అందని ద్రాక్షే!

Today Gold Rate: తగ్గిన బంగారం ధర.. అయినా అందని ద్రాక్షే!

Gold Rates in Telugu States Toady: బంగారం కొండెక్కి కూర్చుంది. దేశంలో బంగారం ధరలు నిత్యావసర వస్తువుల ధరలకంటే వేగంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకూ బ్రేకుల్లేకుండా పరుగులుపెట్టిన పసిడి ధర.. శనివారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.570 నుంచి రూ.760 వరకూ తగ్గింది. అయినప్పటికీ పసిడి కొనుగోలుదారులకు ఊరట లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికీ బంగారం ధర రూ.72 వేలకు పైగానే ఉంది.


బంగారం ధరలు (Gold Rates) ఇలా పెరిగిపోతుండటానికి కారణం.. అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురవుతోన్న ఆర్థిక పరిస్థితులు, యుద్ధ ప్రభావాలు, వడ్డీరేట్లలో వచ్చిన మార్పులు, డాలర్ విలువలో రూపాయికి ఉన్న హెచ్చుతగ్గులేనని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అంటే.. జనవరి 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,200 ఉండగా.. నాలుగు నెలలైనా కాకుండానే ఏకంగా రూ.8 వేల నుంచి రూ.10 వేల మేర పెరగడం కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తోంది.

అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం ధర తగ్గితే కొనాలని ఎదురుచూస్తున్నవారికి పెద్ద షాకే తగిలినట్లైంతి. వారి ఎదురుచూపులు ఫలించలేదు. ఆశాభంగమే కలిగింది. తగ్గుతుందనుకున్న బంగారం ఒకేసారి వేలల్లో పెరగడంతో.. కొనుగోలుదారులకు కాస్త వెనకాడుతున్నారు.


Also Read : ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!

ప్రపంచదేశాలు బంగారం నిల్వలకు పోటీపడటం కూడా పసిడి ధరల పరుగు కారణంగా తెలుస్తోంది. 2023లో డ్రాగన్ కంట్రీ చైనా మాత్రమే 225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తమ గోల్డ్ నిల్వలను 2200 టన్నులకు పెంచుకుంది. అలాగే.. పోలాండ్ 130 టన్నులు, సింగపూర్ 77 టన్నుల బంగారాన్ని కూడగట్టుకున్నాయి. కరెన్సీ కంటే బంగారాన్ని నిల్వ ఉంచుకోవడమే మంచిదని కేంద్రబ్యాంకులు కూడా భావించడం గమనార్హం. ఎవరికివారే బంగారంపైనే మొగ్గు చూపుతుండటం దాని ధరను మరింత పెంచుతోంది.

ఏప్రిల్ 13, శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,550 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500గా ఉంది. కిలో వెండి ధర రూ.1000 తగ్గడంతో ప్రస్తుతం రూ.89,000గా ఉంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×