Big Stories

Gold and Silver Price Today : వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి..

- Advertisement -

Gold and Silver Rates on March 23rd : కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజు తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల ధరపై రూ.450 తగ్గగా.. శనివారం రూ.80 నుంచి రూ.170 వరకూ తగ్గింది. పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్న సమయంలో బంగారం ధర స్వల్పంగా తగ్గినా.. పసిడి కొనుగోలు దారులకు అది శుభవార్తే. అధికమొత్తంలో బంగారాన్ని కొనే వారికి డబ్బు ఆదా అవుతుంది. మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.61,250కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.110 తగ్గి.. రూ.66,820కి దిగొచ్చింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి.. రూ.50,110కు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి.

Also Read : సీక్రెట్‌గా సెకండ్ మ్యారెజ్ చేసుకున్న జొమాటో సీఈఓ.. ఎవరినో తెలుసా?

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,470గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,660గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,970గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

కేరళ, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

బంగారం స్వల్పంగా తగ్గితే.. వెండి ధర పెరిగింది. శుక్రవారం కిలో వెండి పై రూ.2000 తగ్గగా.. నేడు (మార్చి23) రూ.1000 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,500 ఉంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News