BigTV English

Amazon: అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీమియర్ లీగ్ సేల్.. రూ.11వేల లోపు టాప్ 5G మొబైల్స్ ఇవే..!

Amazon: అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీమియర్ లీగ్ సేల్.. రూ.11వేల లోపు టాప్ 5G మొబైల్స్ ఇవే..!
Amazon Smartphones Premier League Sale
Amazon Smartphones Premier League Sale

Amazon Smartphones Premier League Sale: మార్కెట్‌లోకి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ వచ్చిందంటే చాలు ఫోన్ ప్రియులు ఎగబడి కొనేస్తుంటారు. కొందరు బడ్జెట్ ధరలో ఫోన్లను సెర్చ్ చేస్తుంటే.. మరికొందరేమో అద్భతమైన ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్‌లో వెతికేస్తుంటారు. అయితే మరి బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో సూపర్ డూపర్ డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో పలు 5జీ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో 5జీ మొబైళ్లను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి.

అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో బడ్జెట్ ధరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుక్కోవచ్చు. ఎవరైనా రూ.11000 లోపు సిగ్మెంట్‌లో మొబైల్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇది మంచి అవకాశం. ఇందులో ఫ్లాట్ తగ్గింపులతో పాటు ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై కూపన్, బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు.


Also Read: 5జీ ఫోన్‌పై రూ.41 వేల భారీ డిస్కౌంట్.. ఇప్పుడు రూ.3,999లకే కొనుక్కోవచ్చు..

Redmi 13C 5G:

Redmi 13C మొబైల్ అమెజాన్‌లో మంచి ధరకు అందుబాటులో ఉంది. దీని 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. ఇప్పుడు ఈ బేస్ వేరియంట్‌పై రూ.1000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అప్పుడు దీనిని రూ.9,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 50MP ప్రధాన లెన్స్‌తో f/1.8 ఎపర్చరుతో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో వచ్చింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్‌ని కలిగి ఉంది.

Poco M6 Pro 5G:

పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అందరికీ అందుబాటు ధరలో అమెజాన్‌లో ఉంది. దీని 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999కి బదులుగా 38 శాతం తగ్గింపుతో ఇప్పుడు రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొనుగోలుదారులు రూ.784 నుండి నో-కాస్ట్ EMI ఎంపికపై స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.

ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.9,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ 5జీ ఫోన్ రూ.649లకే సొంతం అవుతుంది. అయితే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఫోన్ ఈ ధరకు లభిస్తుంది. లేకపోతే మరింత అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది.

Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు!

ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రధాన లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు క్లిక్ చేయడానికి ముందు భాగంలో 8MP కెమెరాను కలిగి ఉంది. ఇది Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

iQOO Z6 Lite 5G:

అమెజాన్‌లో iQOO Z6 Lite 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 43 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,499కే కొనుక్కోవచ్చు.

దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.10,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ.599లకే సొంతం చేసుకోవచ్చు. అయితే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉంటేనే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం పొందుతారు.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

ఇది 6.58-అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. Full+HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 50MP ప్రధాన లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. Snapdragon 4 Gen 1 SoC ద్వారా అందించబడుతుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

MacBook Air Discount: రూ50000 కంటే తక్కువ ధరకు ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్.. లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి

Iphone Crash Detecton: డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిన యువతి.. కారు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఐఫోన్

itel A90 Limited Edition: ₹7,000 లోపు ధరలో మిలిటరీ-గ్రేడ్ ఫోన్.. ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

Pixel 10 Screen Glitch: పిక్సెల్ 10లో స్క్రీన్ గ్లిచ్ సమస్య.. ఫిర్యాదులు చేస్తున్న యూజర్లు

Content Creators Budget Phones: సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బడ్జెట్ ఫోన్లు.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే

6G Chip 100 GBPS : ఒక్క సెకండ్‌లో 10 సినిమాలు డౌన్‌లోడ్.. వచ్చేసింది 6G చిప్

Big Stories

×