Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. నటనతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.. ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఫిమేల్ సెంట్రిక్ మూవీతో రూ.100 కోట్లకు క్లబ్లో చేరిన మొదటి సినిమాగా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో తాను గర్భవతిని అని చెప్పిన సమంత.. అప్పటినుంచి తన బేబీ బంప్ ఫోటోషూట్లతో, సీమంతం వేడుకలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసింది.
మరోవైపు సమంతకి కవలలు పుట్టారు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వైరల్ అవ్వగా.. వాటిపై సమంత కూడా స్పందించింది. దీంతో సమంత ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవ్వగా.. ఎట్టకేలకు ఆ తరుణం రానే వచ్చింది. సమంత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. తన భర్త రాజ్ నిడిమోరు, తన చేతులలో.. తనకు పుట్టిన బిడ్డ చిన్న చేతులను పట్టుకొని షేర్ చేసిన ఆ ఇంస్టాగ్రామ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
ఇకపోతే సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు నయనతార , నీరజాకోన, కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సమంతకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఈ సందర్భంగా రాజ్, సమంతా దంపతులు తమకు పుట్టిన బిడ్డకు అప్పుడే నామకరణం కూడా చేశారు.’ దేవ్ నిడిమోరు ‘ అంటూ నామకరణం చేసినట్లు అభిమానులతో పంచుకున్నారు. మొత్తానికైతే గత కొంతకాలంగా బేబీ బంప్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకున్న సమంత.. ఎట్టకేలకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
సమంత, రాజ్ నిడిమోరు దంపతుల విషయానికి వస్తే.. గత ఏడాది డిసెంబర్లో ఈషా యోగ సెంటర్లో లింగ బైరవి ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. భూతశుద్ధ పద్ధతిలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన ఈ జంట.. ఈ ఏడాది సెప్టెంబర్ లో శ్రీ కల్పం పద్ధతిలో సీమంతం వేడుకలను జరుపుకుంది సమంత. చక్రం మధ్యలో కూర్చొని మరీ ఈ సీమంతం వేడుకలను జరుపుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక రెండు రోజుల క్రితం తన అత్తగారి కుటుంబ సభ్యుల సమక్షంలో మాతృ శిశుమంగళ ఆశీర్వాదం పేరిట సీమంతం వేడుకలను జరుపుకుంది. ఇక నిన్న తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏ రోజైనా నేను డెలివరీ అవ్వచ్చు అంటూ సరదాగా ఒక వీడియో షేర్ చేసిన ఈమె ఎట్టకేలకు డిసెంబర్ నవంబర్ 19వ తేదీన డెలివరీ అయింది. ఇకపోతే ఈ విషయాన్ని ఒకరోజు ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నారు సమంత. మొత్తానికి అయితే డెలివరీ అయ్యారని తెలియడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.