E-Paper
Advertisement

Gold Rates: పండుగలు వచ్చేస్తున్నాయ్.. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూశారా ?

Gold Rates: పండుగలు వచ్చేస్తున్నాయ్.. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూశారా ?
Advertisement

August 27th Gold Rates : పండుగలు వచ్చేస్తున్నాయ్. వినాయక చవితి మొదలు.. దసరా, ధన త్రయోదశి, దీపావళి.. వరుసగా రానున్నాయి. మరి సందర్భం ఏదైనా.. గోల్డ్ కొనుగోలు చేసేవారు ఉండనే ఉంటారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతోనే గోల్డ్ ధరలు 3 వేల రూపాయల మేర తగ్గాయి. కానీ.. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ.. రూ.69 వేలకు తగ్గిన మేలిమి బంగారం ధర మళ్లీ రూ. 73 వేలకు చేరుకుంది.

శ్రావణమాసం అంటేనే పెళ్లిళ్ల నెల. సాధారణంగానే ఈ నెలలో పెళ్లిళ్లు చాలానే జరుగుతాయి. అందులోనూ ఈ ఏడాది శ్రావణం తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో.. వేల సంఖ్యలో జంటలు పెళ్లిపీటలెక్కాయి. మరి అన్ని పెళ్లిళ్లకూ బంగారం మస్ట్ గా ఉండాల్సిందే కదా. ఆ డిమాండ్ తో కూడా బంగారం ధర పెరిగింది. బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు, డిమాండ్ కలిపి బంగారం ధర మళ్లీ రూ.3 వేల నుంచి రూ.4 వేల మేర పెరిగింది.

Advertisement

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?

గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఆగస్టు 18న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,700గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,770గా ఉంది. ఆగస్టు 20న 10 గ్రాములపై రూ.100 నుంచి రూ.120 మేర ధర తగ్గింది. 21న రూ.500 నుంచి రూ.550 మేర పెరిగింది. ఆ తర్వాతి రెండ్రోజుల్లో రూ.500 నుంచి రూ.570 వరకూ బంగారం ధర తగ్గింది. 24న ధరలు పెరిగి.. 10 గ్రాముల బంగారం ధర రూ.66,950, రూ.73,040 వరకూ పెరిగింది. తాజాగా స్వల్పంగా బంగారం ధర తగ్గింది.

Advertisement

నేడు హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,940గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.73,030గా ఉంది.

బంగారం ధర తగ్గినా.. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.600 పెరగడంతో.. ప్రస్తుతం ధర రూ.93,500గా ఉంది. గడిచిన 10 రోజుల్లో కిలో వెండి ధర రూ.2500 మేర పెరిగింది. మరి పండుగలకు, శుభకార్యాలకు వెండి, బంగారం కొనుగోలు చేయాలంటే.. ఇప్పుడు కొనేయడం మంచిది. ముందు ముందు బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి.

 

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×