E-Paper
Advertisement

చదివింది 4వ తరగతి మాత్రమే.. నేడు రూ.వేల కోట్ల బిజినెస్‌కు అధిపతి

చదివింది 4వ తరగతి మాత్రమే.. నేడు రూ.వేల కోట్ల బిజినెస్‌కు అధిపతి
Advertisement

Rags To Riches Success Story| చాలా మంది జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే వాటి కోసం నిరంతరం కష్టపడతారు. అలా నిర్విరామ కృషితో విజయం సాధించేది కొందరే. ఆ కొందరిలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో విజయ గాథ. ఈ రోజు మనం అలాంటి ఒక తెలుగు వ్యక్తి గురించి తెలుసుకుందాం.

తెలుగురాష్ట్ర ప్రజలకు కిరణ్ కుమార్ అనగానే తెలియకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన డైలాగ్ ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ మాత్రం గుర్తుంటుంది. ప్రతి ఒక్క కంపెనీ తమ బిజినెస్ ప్రొమోషన్ల కోసం సెలిబ్రిటీల సేవలను ఉపయోగించుకుంటున్న ఈ రోజుల్లో కిరణ్ కుమార్ తన బిజినెస్ కోసం తనే బ్రాండ్ ప్రొమోటర్ గా అవతారమెత్తాడు. తన బంగారు నగల బిజినెస్.. లలితా జ్యువెలరీకి ప్రజలకు తన మాటలతో చేరువ చేశాడు. ఈ రోజు దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లలితా జ్యువెలరీకి మొత్తం 63 షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు లలితా జ్యువెలరీ ఆదాయం దాదాపు రూ.25,000 కోట్లుగా ఉంది. ఇదంతా కిరణ్ కుమార్‌కు అంత ఈజీగా లభించలేదు.

Advertisement

కిరణ్ కుమార్ తన జీవితాన్ని పేదరికంతో ప్రారంభించి, నేడు భారీ ఆభరణాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. చిన్న జ్యువెలరీ స్టోర్‌గా ప్రారంభమైన వ్యాపారాన్ని ఆయన వేల కోట్లు విలువ చేసే లలితా జ్యువెలరీగా అభివృద్ధి చేశారు.

కష్టాలతో నిండిన బాల్యం

కిరణ్ కుమార్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులకు ఆయన ఎనిమిదో సంతానం. ఆయన తండ్రి నగల వ్యాపారుల వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు. అయితే, పెద్ద కుటుంబాన్ని పోషించడం వారి కుటుంబానికి చాలా కష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా కిరణ్ కుమార్ ఐదో తరగతిలోనే చదువు మానేశారు. సుమారు 12 ఏళ్ల వయసులోనే ఆయన నగల దుకాణంలో పనిచేయడం ప్రారంభించారు. చిన్న వయసులోనే ఆయన నగల తయారీ, విక్రయాలు, మార్కెట్ గురించి అనుభవాన్ని సంపాదించారు.

పెట్టుబడి కోసం బంగారు గాజులు ఇచ్చిన తల్లి

Advertisement

నెల్లూరులో తయారైన నగలు చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లకు వెళ్తున్నాయని కిరణ్ కుమార్ గమనించారు. ఆయన స్వయంగా చెన్నైకి వెళ్లి నగలు విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
కానీ, ఆ వ్యాపారం ప్రారంభించడానికి ఆయన వద్ద ఎలాంటి పెట్టుబడి లేదు. అప్పుడు ఆయన తల్లి.. కుమారుడిపై నమ్మకంతో తన వద్ద ఉన్న నాలుగు బంగారు గాజులను కుమారుడికి ఇచ్చారు. ఆ గాజుల బరువు సుమారు 48 గ్రాములు. కిరణ్ కుమార్ ఆ బంగారంతో కొన్ని చెవి ఆభరణాలు తయారు చేయించారు. ఆ తర్వాత వాటిని విక్రయించడానికి చెన్నైకి ప్రయాణించారు.

మొదటి పెద్ద ఆర్డర్‌తో మారిన జీవితం

చెన్నైలోని టీ నగర్‌లో ప్రాంతంలో ఉన్న లలిత జ్యువెలరీ ఒక్కప్పుడు కిరణ్ కుమార్‌ది కాదు. ఆ సంస్థ యజమాని పేరు ఎం.ఎస్. కందస్వామి పిళ్లై. చెన్నై వెళ్లి పిళ్లైను కిరణ్ కుమార్ కలిశారు. కిరణ్ కుమార్ తీసుకొచ్చిన చెవి ఆభరణా నాణ్యతను పిళ్లై పరిశీలించి.. 100 గ్రాముల ఆర్డర్ ఇచ్చారు. తర్వాత డిమాండ్ పెరగడంతో ఆ ఆర్డర్ 200 గ్రాములకు పెరిగింది. కిరణ్ కుమార్ క్రమంగా తన హోల్‌సేల్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయన నెల్లూరు, చెన్నై మధ్య తరచూ ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆర్డర్లను పూర్తి చేసేవారు. తర్వాత ఆయన నగల వ్యాపారం విదేశీ మార్కెట్లకు కూడా విస్తరించింది.

1999లో వచ్చిన లలితా జ్యువెలరీ ఓనర్‌గా కిరణ్ కుమార్

1999 ఫిబ్రవరి 24న కిరణ్ కుమార్ జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. కందస్వామి పిళ్లై తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బంది పడ్డారు. కిరణ్ కుమార్ ఆ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుని బకాయిల పరిష్కారంలో సహాయం చేశారు. వ్యాపారాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఇంగ్లీషులో లలిత (Lalitha) పేరుకు మరో “a” (Lalithaa) జోడించారు. అలా లలిత జ్యువెలరీ.. కాస్త లలితా జ్యువెలరీగా కొత్త గుర్తింపు పొందింది.

Also Read: రిటైర్మెంట్ అంటే భయపడుతున్న భారతీయులు.. ఏ వయసు నుంచి ప్లానింగ్ ప్రారంభించాలి?

తక్కువ ధరలతో విజయవంతమైన వ్యూహం

కిరణ్ కుమార్ వినియోగదారులు నగల ధరలను ఎలా పోల్చుకుంటారో జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఆయన తక్కువ అదనపు ఛార్జీలు, పోటీ ధరలపై వ్యాపారాన్ని నిర్మించారు. ఆయన నేతృత్వంలో లలితా జ్యువెలరీ తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేసే విధానాన్ని అనుసరించింది. ఈ వ్యూహం సంస్థకు భారీ సంఖ్యలో కష్టమర్లు ఆకర్షితులయ్యారు.

నేడు నగల వ్యాపారంలో పెట్టింది పేరు

లలితా జ్యువెలరీ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని అనేక నగరాల్లో విస్తరించింది. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరిలలో మొత్తం 63 స్టోర్లు ఉన్నాయి. తమిళనాడులోని తయారీ కేంద్రాల నుంచి నగలు సేకరించి రిటైల్ షోరూమ్స్‌లో విక్రయిస్తారు. లలితా జ్యువెలరీ సంస్థ ఆదాయం ఆర్థిక సంవత్సరం 2023-24 (FY24)లో రూ.16,800 కోట్ల ఉండగా తాజాగా ఆర్థిక సంవత్సరం 2025-26 (FY26)లో రూ.25,000 కోట్లకు పెరిగింది.

కిరణ్ కుమార్ ప్రయాణం పట్టుదల, అనుభవం, సాహసోపేత నిర్ణయాలు విజయాన్ని తీసుకురాగలవని చూపిస్తుంది. నాలుగు బంగారు గాజులతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మారింది.

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×