E-Paper
Advertisement

నెలకు రూ.30k, 50k, లక్ష జీతమా? మీ సేవింగ్స్ ఎంత ఉండాలో.. పక్కా లెక్కలు ఇవే!

నెలకు రూ.30k, 50k, లక్ష జీతమా? మీ సేవింగ్స్ ఎంత ఉండాలో.. పక్కా లెక్కలు ఇవే!
Advertisement

Emergency Fund: జీవితంలో ఆర్థిక కష్టాలు ఎప్పుడు, ఎలా చుట్టుముడతాయో ఊహించడం చాలా కష్టం. ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం వంటి చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో ఆదుకునేందుకు ‘ఎమర్జెన్సీ ఫండ్’ (Emergency Fund) అనేది చాలా అవసరం. ప్రతీ నెలా ఎంత వస్తుందనే దానికంటే ఎంత దాచి పెడుతున్నామనేది చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు నిత్యం చెబుతుంటారు. కాబట్టి నెలకు వచ్చే జీతాన్ని బట్టి ఎంత డబ్బు అత్యవసర నిధిగా ఉంచుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

నెలకు రూ.30,000 సంపాదిస్తున్నారా?

నెలకు రూ.30 వేల జీతం ఉండి.. బాధ్యతలు లేకుండా సింగిల్ గా జీవిస్తుంటే.. 3 నెలల ఖర్చుకు సరిపడ డబ్బు పక్కన పెడితే మంచిది. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.25,000 అనుకుంటే 3 నెలలకు గాను రూ.75,000 అత్యవసర నిధిగా ఉండాలి. ఒకవేళ మీరు కుటుంబంతో ఉంటూ ఇంటి అద్దె, ఈఎంఐలు, వైద్య ఖర్చులు వంటి బాధ్యతలు ఉంటే కనీసం 6 నెలల ఖర్చులకు అంటే దాదాపు రూ.1.5 లక్షలు దాచుకోవడం బెటర్.

రూ.50,000 జీతం వస్తుంటే..

Advertisement

రూ. 50,000 వరకు సంపాదించే వారికి.. సాధారణంగా ఇంటి అద్దె, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు నెలవారీ ఖర్చులు సుమారు రూ.40,000 అనుకుంటే 6 నెలల అత్యవసర నిధిగా కనీసం రూ.2.4 లక్షలు సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు మాత్రమే ఇంటికి ఆధారమై ఉంటే 9 నెలల ఖర్చులకు సరిపడేలా రూ.3.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు సేవింగ్స్ చేయడం బెస్ట్.

నెలకు రూ.1 లక్ష రాబడి ఉంటే?

సాధారణంగా నెలకు రూ.1 లక్ష సంపాదించే వారికి బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. హోమ్ లోన్, కార్ లోన్, పిల్లల చదువుల ఫీజులు వంటివి వారి ప్రధాన ఖర్చులుగా మారిపోతాయి. ఇంత శాలరీ ఉన్నవారికి నెలకు రూ.70,000 నుండి రూ.80,000 వరకు ఖర్చవుతుంటుంది. కాబట్టి కనీసం 6 నెలలకు సరిపడా రూ.4.5 లక్షల నుండి రూ.5 లక్షల ఫండ్ వాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్, వ్యాపారవేత్త, కుటుంబంలో ఏకైక సంపాదకులు అయితే 9 నుండి 12 నెలలకు సరిపడ సేవింగ్స్ తప్పనిసరి. ఇందుకోసం రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల వరకు దాచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

ఈ డబ్బును ఎలా దాచుకోవాలి?

సాధారణంగా అత్యవసర నిధి అనేది వెంటనే ఉపయోగించుకునేలా ఉంటే బెటర్. అందుకే బ్యాంక్ లోని సేవింగ్స్ ఖాతా రూపంలో, షార్ట్ టర్మ్ ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో మనీని దాచుకోవచ్చు. లేదంటే గోల్డ్ రూపంలోనూ భద్రపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా అనుకోని సమస్య ఏదైనా వస్తే.. వెంటనే డబ్బును తిరిగి పొందేందుకు వీలు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

Tags

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×