Bhogapuram Airport: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుంది. అందుకు గాను నేడు ఉదయం 9.15 గంటలకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడ 10.45 గంటలకు ప్రధానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గోననున్నారు.
ముందుగా 10.58 గంటలకు ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఎర్పాట్లను చేసింది. ఏక రూప దుస్తులతో నిర్వహించిన రిహార్సల్‌కు అతిపెద్ద థింసా నృత్యంగా ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని చుట్టూ ప్రభుత్వం ఎర్పాట్లు చేసింది.
Also Read: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు!
విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తొలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాద స్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాల అలంకరణను చేశారు. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం 12 నిముషాల పాటు ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రధాని మోదీ తిలకించనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరై మాట్లాడనున్నారు.
Also Read: జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!