E-Paper
Advertisement

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడి చేయడానికి ఇది సరైన సమయమేనా?

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడి చేయడానికి ఇది సరైన సమయమేనా?
Advertisement

Gold Silver Prices Buying Opportunity| బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగిన తర్వాత మంగళవారం కొంత తగ్గాయి. అమెరికా వడ్డీ రేట్లు, చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ అంశాలు రాబోయే రోజుల్లో విలువైన బంగారం, సిల్వర్ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం బంగారం ధర రూ.1,60,000 లోపు ఉంది.
వెండి ధర రూ.2,50,000 దాకా నమోదైంది.
అయితే, ఒక్కరోజు ధర మార్పును చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.

అమెరికా వడ్డీ రేట్లపై అందరి దృష్టి

Advertisement

బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో అమెరికా వడ్డీ రేట్లు ఒకటి. వచ్చే నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం తగ్గిందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు ఈ అంచనాలను మార్చాయి. జూలైలో ఊహించని విధంగా ఉద్యోగాలు తగ్గాయి. వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా అంచనాల కంటే తక్కువగా నమోదైంది. రిటైల్ అమ్మకాలు కూడా బలహీనంగా కనిపించాయి.
ఇన్‌వెస్ట్‌మెంట్ నిపుణులు ఆగ్మాంట్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రేనిషా చెనాని ఈ పరిణామాలను వివరించారు. ఫెడరల్ రిజర్వ్ తాజా సమావేశ వివరాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపారు. ఈ వివరాలు భవిష్యత్తులో వడ్డీ రేట్లపై కీలక సంకేతాలు ఇస్తాయి. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు మారకుండా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పెరుగుతున్న చమురు ధరలు బంగారంపై ప్రభావం చూపవచ్చు

చమురు ధరలు కూడా విలువైన లోహాల మార్కెట్‌కు ముఖ్యమైన అంశంగా మారాయి. ఇరాన్ తన సైనిక వైఖరిని మరింత దూకుడుగా మార్చుకుంటామని ప్రకటించింది. అమెరికాతో శాశ్వత కాల్పుల విరమణపై చర్చలు విఫలమైన తర్వాత ఈ పరిణామం జరిగింది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలో వెనుకడుగు వేయవచ్చు. అధిక వడ్డీ రేట్లు బంగారం వంటి వడ్డీ ఆదాయం లేని ఆస్తులపై ఒత్తిడి పెంచుతుంది.

బంగారం ధరలకు మద్దతుగా భౌగోళిక ఉద్రిక్తతలు 

Advertisement

అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తారు. అనిశ్చితి పెరిగితే బంగారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ చైనాని ప్రకారం.. బంగారం మళ్లీ సేఫ్-హేవెన్ డిమాండ్‌ను పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరల పతనం కొంత పరిమితం కావచ్చు.

ఇప్పుడు బంగారం, వెండి కొనాలా?

ఇటీవలి ధర తగ్గుదలతో విలువైన లోహాల దీర్ఘకాలిక పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పలేం. ఒక్కరోజు ధరల ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. భారీ ర్యాలీ తర్వాత బంగారం, వెండి ధరల్లో స్వల్ప దిద్దుబాట్లు సాధారణంగా కనిపిస్తాయి.

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు దశలవారీగా కొనుగోలు చేయవచ్చు

ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా వివిధ ధరల వద్ద కొనుగోలు చేయడం ద్వారా రిస్క్ తగ్గించవచ్చు. బంగారం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై (వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు) ఉపయోగపడుతుంది. ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి సమయంలో ఇది రక్షణగా కూడా పనిచేయవచ్చు. అయితే, మొత్తం పెట్టుబడిని బంగారంలోనే పెట్టడం మంచిది కాదు.

Also Read: పార్ట్ టైమ్ బిజినెస్‌తో నెలకు రూ.30 లక్షల ఆదాయం.. కేవలం రూ.19000 పెట్టుబడి

వెండి విషయంలో మరింత జాగ్రత్త అవసరం

ఎందుకంటే వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్‌పై కూడా ఎక్కువగా ఆధారపడతాయి. అందువల్ల వెండి ధరల్లో బంగారం కంటే ఎక్కువ హెచ్చుతగ్గులు కనిపించవచ్చు.

పెట్టుబడిదారులు ఈ అంశాలను గమనించాలి

ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు.. ద్రవ్యోల్బణం, ఉద్యోగ గణాంకాలను పెట్టుబడిదారులు గమనించాలి. అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్, ముడి చమురు ధరలు కూడా కీలకంగా మారవచ్చు. అమెరికా-ఇరాన్ పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల స్వల్పకాలిక ధరల కంటే తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×