E-Paper
Advertisement

పసిడి ప్రియులకు సడెన్ షాక్.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్‌తో ధరల్లో మార్పులు, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

పసిడి ప్రియులకు సడెన్ షాక్.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్‌తో ధరల్లో మార్పులు, మార్కెట్లో రేటు ఎలా ఉంది?
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా రాత్రికి రాత్రే పసిడి కొనుగోలు‌దారులకు ఊహించని షాక్ తగిలింది. యూఎస్ బాండ్స్.. 2007 నాటి గరిష్ఠ స్థాయిల నుంచి ఒక్కసారిగా దిగిరావడం దీనికి కారణంగా తెలుస్తోంది. ఫలితంగా యూఎస్ డాలర్ పడిపోవడం మరొక కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

పసిడి ప్రియులకు సడెన్ షాక్

Advertisement

శ్రావణ శుక్రవారం రోజు బంగారు కొనుగోలు చేయాలని భావించేవారికి భారీ షాక్. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాత్రికి రాత్రి పసిడి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది. యూఎస్ బాండ్స్.. మార్కెట్లో 2007 నాటి గరిష్ఠ స్థాయిల నుంచి దిగి వచ్చాయి. ఫలితంగా యూఎస్ డాలర్ పతనమైంది. దీంతో మదుపరులు చూపు విలువైన లోహాలు బంగారం , వెండిపై పడింది.

 

డాలర్ పతనం, బంగారం వైపు మదుపరుల చూపు

Advertisement

ఈ క్రమంలో ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4530 డాలర్ల మార్కు దాటి ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ రేటు కూడా 69 డాలర్లకు పెరిగి, అక్కడ ట్రేడింగ్ జరుగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే దేశీయంగా గోల్డ్-సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా గురువారం తగ్గిన బంగారం ధర, మళ్లీ ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగింది. సుమారు రూ. 4 వేల వరకు ఎగబాకింది.  వెండి అయితే ఒక్కరోజు రూ. 10 వేలు వరకు పెరిగింది.

 

అమాంతంగా పెరిగిన బంగారం-వెండి ధరలు

దేశీయంగా హైదరాబాద్ తోపాటు మెట్రో నగరాల్లో ఆగస్టు 21న ఉదయం బంగారం-సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా దాదాపు రూ. 4 వేలు పెరిగింది. హైదరాబాద్, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,000 గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి రేటు రూ. 1,59,270 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ మేలిమి పుత్తడి ధర రూ. 1,59,420 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల పసిడి ప్రస్తుతం రూ. 1,46,150 వద్ద ఉంది.

ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర 1,59,270 వద్ద అటు ఇటు కదుతులున్నాయి. 22 క్యారెట్ల పుత్తడి ప్రస్తుతం రూ. 146000 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది. గురువారం రూ. 5 వేలు తగ్గగా, శుక్రవారం ఏకంగా రూ. 10 వేలు పెరిగింది. హైదరాబాద్ సిటీలో వెండి కేజీ రేటు రూ. 2.60 లక్షలకు చేరింది.

ALSO READ: ఇథనాల్ లేని పెట్రోల్ కావాలా? ఏ స్టేషన్‌లో లభిస్తుందో చూపించే యాప్‌ ఇదిగో

ఢిల్లీలో వెండి ధర రూ. 2.55 లక్షల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, అమరావతి, గుంటూరు, విశాఖపట్నంలో వెండి రేటు కేజీ రూ. 2.60 లక్షల వద్ద పలుకుతోంది. అంతర్జాతీయ పరిణామాలను బులియన్ వర్గాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. కొద్దిరోజుల వరకు బంగారం-వెండి ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.

Related News

టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం

దసరాకు జియో ఐపీఓ.. ఒక్కో షేరు ధర ఎంత ఉండొచ్చు, మరి జీఎంపీ మాటేంటి?

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

Big Stories

Advertisement
×