E-Paper
Advertisement

ఇథనాల్ లేని పెట్రోల్ కావాలా? ఏ స్టేషన్‌లో లభిస్తుందో చూపించే యాప్‌ ఇదిగో

ఇథనాల్ లేని పెట్రోల్ కావాలా? ఏ స్టేషన్‌లో లభిస్తుందో చూపించే యాప్‌ ఇదిగో
Advertisement

Ethanol Free Fuel App| 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లభిస్తోంది. అయితే ఈ పెట్రోల్ వాడకం వల్ల చాలా వాహనాల్లో సమస్యలు వస్తున్నాయి. ఆ రిపేర్ ఇబ్బందులు నివారించేందుకు చాలా మంది వాహనదారులు ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకుంటున్నారు. కానీ ప్యూర్ పెట్రోల్ అంత ఈజీగా అందుబాటులో లేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ స్టేషన్లలో అది కూడా అధిక రేటుకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇథనాల్ లేని పెట్రోల్ ఉన్న స్టేషన్లు ఏవి.. అని తెలుసుకునేందుకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఆ వాహనదారుల కోసమే ఒక ప్రత్యేక యాప్ ఉంది. ఈ యాప్ పేరు EO Finder. ఈ యాప్ వివిధ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి సంస్థల సమాచారం ఉంటుంది.

Advertisement

ఈ వివరాలను.. యాప్ ఒక ఇంటరాక్టివ్ మ్యాప్‌లో చూపిస్తుంది. వినియోగదారులు తమకు కావాల్సిన ఇంధన గ్రేడ్ ఆధారంగా బంకులను ఫిల్టర్ చేయవచ్చు. ప్రతి పెట్రోల్ బంకు సమాచారం ఎక్కడి నుంచి సేకరించారో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆ సమాచారం చివరిసారి ఎప్పుడు రిఫ్రెష్ చేశారో కూడా చూపిస్తుంది.

సమీపంలోని ఇథనాల్ లేని పెట్రోల్‌ను ఎలా వెతకాలి?

ముందుగా యాప్‌ను తెరిచి మ్యాప్‌లో కనిపించే సమీప పెట్రోల్ బంకులను పరిశీలించాలి. మ్యాప్‌లో వివిధ ఇంధన గ్రేడ్లను వేర్వేరు రంగులతో చూపిస్తారు. తర్వాత ‘Near Me’ ఆప్షన్‌పై క్లిక్ చేసి సమీప బంకులను వెతకాలి. మీకు కావాల్సిన ఇంధన గ్రేడ్‌ను ఎంచుకుని సంబంధిత బంకులను ఫిల్టర్ చేయవచ్చు.

Advertisement

అందులో ప్యూర్ పెట్రోల్ అంటే 100 శాతం ఆక్టేన్ (100 octane) ఎంచుకోవాలి. E0, XP100, Power 100, Speed 100 వంటి పేర్లతో ప్యూర్ పెట్రోల్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే E85, E100 ఇంధనాలను అందించే బంకులను కూడా వెతకవచ్చు. అంటే అధిక శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్.

పెట్రోల్ బంక్ వెళ్లే ముందు వివరాలను పరిశీలించండి

ఏదైనా పెట్రోల్ బంకుపై క్లిక్ చేస్తే దాని పూర్తి వివరాలను చూడవచ్చు. అక్కడ కంపెనీ పేరు, ఇంధనం పేరు, ధర, ధృవీకరణ తేదీ వంటి వివరాలు కనిపించవచ్చు. కొన్ని లిస్టింగ్స్‌లో సమాచారం నమ్మక స్థాయిని సూచించే కాన్ఫిడెన్స్ లేబుల్ కూడా ఉంటుంది. అయితే ధరలు, ఇంధన లభ్యత తరచుగా మారవచ్చు. అందువల్ల ప్రయాణానికి ముందు పెట్రోల్ బంకుకు ఫోన్ చేయడం మంచిది.

యాప్ ద్వారా దిశలను కూడా తెలుసుకోవచ్చు

వినియోగదారులు యాప్ నుంచే సంబంధిత పెట్రోల్ బంక్‌కు ఫోన్ చేసే వెసలుబాటు కూడా ఉంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ ద్వారా పెట్రోల్ స్టేషన్‌కు చేరుకునే మార్గాన్ని తెలుసుకోవచ్చు. యాప్‌లో పేరు, నగరం లేదా రాష్ట్రం ఆధారంగా పెట్రోల్ బంకులను వెతకడానికి లిస్ట్ వ్యూ కూడా ఉంటుంది.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

తప్పుడు సమాచారం ఉంటే ఫిర్యాదు చేయవచ్చు

ఏదైనా పెట్రోల్ బంకు సమాచారం తప్పుగా కనిపిస్తే వినియోగదారులు దానిని రిపోర్ట్ చేయవచ్చు. ఇలాంటి ఫీడ్‌బ్యాక్ యాప్‌లోని సమాచారాన్ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే దూర ప్రయాణానికి ముందు ఇంధనం లభ్యతను స్వయంగా నిర్ధారించుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Related News

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

పోస్టాఫీసులో ఆ స్కీమ్ గురించి తెలుసా? ఐదేళ్లలో రూ.4,50,000 వడ్డీ, ఇవే ఆ డీటేల్స్

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

Big Stories

Advertisement
×