Anna konidala:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ (Mega family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం నుంచి పెద్ద ఎత్తున హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడమే కాకుండా మరొకవైపు దానధర్మాలు చేస్తూ అందరికీ అండగా నిలుస్తున్నారు.. ముఖ్యంగా మెగా హీరోలు, కార్మికులకు, అభిమానులకు అండగా నిలుస్తూ.. ఆర్థికంగా సహాయపడుతుంటే.. ఆ ఇంటి ఆడవాళ్లు వన్యప్రాణులకు సంరక్షణగా నిలుస్తూ మరింత మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోడలు ఉపాసన (Upasana) బాటలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల (Anna konidala) తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి అన్నా కొణిదెల తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో ఒక తెల్ల పులి పిల్లను దత్తత తీసుకొని.. వారి కూతురు క్లీంకారా పుట్టినరోజు సందర్భంగా ఆ పులికి క్లీంకారా అని కూడా నామకరణం చేశారు. ఇప్పుడు వీరి బాటలోనే పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna konidala) కూడా తన పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. అసలు విషయంలోకి వెళ్తే.. తన పుట్టినరోజు సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక అర్థవంతమైన ముందడుగు వేశారు అన్నా కొణిదెల. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో ఉన్న ఒక ఆసియా ఏనుగు , రాయల్ బెంగాల్ పులిని ఆమె తన పుట్టినరోజు సందర్భంగా దత్తత తీసుకున్నారు.

పైగా ఈ రెండు జంతువుల ఏడాది సంరక్షణ, పోషక ఆహారం, వైద్య అవసరాల కోసం సుమారుగా రూ.6.30 లక్షల విరాళాన్ని కూడా ఆమె అందజేశారు. పైగా ఈ నిధులు జంతువుల సంక్షేమం, సంరక్షణ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. ఇకపోతే వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహన పెంచే లక్ష్యంతో అన్నా కొణిదెల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్నా కొన్నిదలా తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు పలువురు యానిమల్ లవర్స్ కూడా వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పుట్టినరోజు లాంటి ప్రత్యేక సందర్భాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ఆదర్శనీయమని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
also read:http://పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?
ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని రక్షిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కనీసం రోజు ప్రకృతి కోసం మనం పాటుపడకపోయినా మన జీవితంలో వచ్చే ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల సమయంలోనైనా అటు ప్రకృతికి ఇటు వన్య ప్రాణులకు ఉపయోగపడేలా ఒక చిన్న మంచి పని చేసినా ఎంతో బాగుంటుంది అంటూ పర్యావరణ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తేనే మన మనుగడ ముందుకు సాగుతుంది.